సంబంధిత కథనం

సంబంధిత కథనం

యిర్మీయ 29:11: “నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకర మైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.”

మీ జీవితమునకు ఒక ప్రణాళిక కలిగియున్నారని తెలుసుకొనుట ఆదరణగా లేదా? మీ మార్గములో ఏమి జరిగినప్పటికినీ  తప్పు మార్గాలు మరియు తప్పు అడుగులకు సంబంధం లేకుండా, దేవుడు మిమ్ములను ఈ క్షణం వరకు నడిపించాడు. వాస్తవానికి, ఆయన మిమ్మల్ని తన వద్దకు నేరుగా నడిపిస్తున్నాడు.

ఒక వాస్తవ విషయమేదనగా మీ అంతిమ నిరీక్షణ మరియు భవిష్యత్తు రెండూ ఆయనలో ఉన్నాయి.  దీనికి అర్ధమేదనగా మీ పూర్తి జీవితాన్ని యేసు కోసం మరియు యేసుతో జీవించుట మరియు ఆయన వలన, ఆయన మిమ్మును ఎన్నడూ విడువను ఎడబాయనని ఆయన చేసిన వాగ్ధానము వలన మీరు ఇప్పుడు చాలా ఉత్తేజకరమైన ఒక దానిని మీరు కలిగియున్నారు!

ఇది ఒక ప్రయాణం : ఒక జీవితకాల ప్రక్రియ

మిమ్మల్ని మీరు ఈ విధంగా ప్రశ్నించుకోవచ్చు, నేను క్రీస్తును అంగీకరించి యున్నాను కనుక ఇప్పుడు నేనేమీ చేయవలెను? మీరు మొదటి అడుగు తీసుకున్నారు కనుక ఇది ఒక గొప్ప ప్రశ్న. ఈరోజు మీరు ఎటువంటి విభిన్నతను పొందనప్పటికినీ క్రీస్తు మీ అంతరంగములోనుండి పని చేయుట ప్రారంభించాడని తెలుసుకోండి.

కొలస్సీ  2:6-7 ఇలా చెప్తుంది: “కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు,  మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి”. ప్రార్ధన ద్వారా, దేవుని వాక్యమును చదువుట ద్వారా మరియు మిమ్మును నడిపించుటకు పరిశుద్ధాత్మ దేవునిని అనుమతించుట ద్వారా ఆ వేరులు మీలో స్థిరపరచబడి యున్నవి.

మీ జీవితమును క్రీస్తుతో ప్రారంభించుట

దేవుని వాక్యములోని వాగ్ధానము మరియు యేసు తన శిష్యులతో పలికిన మాటలివే:  దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.  – యోహాను  10:10.

మీరు క్రీస్తులో సంపూర్ణమైన మరియు ఉత్తేజ పూర్వకమైన జీవితమును జీవించుటకు పిలువ బడ్డారు మరియు మీ ప్రయాణమును బలముగా ప్రారంభించుటకు మీకు సహాయం చేయవలెనని కోరుతున్నాము.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon