దేవుని శక్తి యందు నమ్మిక యుంచుము

మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెనని, నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని. (1 కొరింథీ 2:4–5)

విద్య ముఖ్యమైనది, అయితే ప్రాపంచిక విద్య మరియు మానవ తత్వశాస్త్రం కంటే దేవుని జ్ఞానం ఉత్తమమైనది మరియు విలువైనది అని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. అపొస్తలుడైన పౌలు అత్యున్నత విద్యావంతుడు, అయితే దేవుని శక్తి తన బోధనను విలువైనదిగా మార్చిందని, కానీ తన విద్యను కాదని అతను గట్టిగా చెప్పాడు.

కళాశాల నుండి ఆనర్స్ మరియు డిగ్రీలతో గ్రాడ్యుయేషన్ పొందిన మరియు ఉద్యోగాలు పొందడంలో ఇబ్బంది పడుతున్న చాలా మంది వ్యక్తులు నాకు తెలుసు. కళాశాలకు వెళ్ళే అవకాశం లేని వ్యక్తులు కూడా నాకు తెలుసు, మరియు వారు దేవుని అనుగ్రహం పై మరియు దేవునిపై ఆధారపడేవారు మరియు వారు గొప్ప ఉద్యోగాలతో ఆశీర్వదించబడ్డారు. మీ నమ్మకం ఎక్కడ ఉంది? అది దేవునిలో ఉందా లేదా మీకు తెలిసిన దానిలో ఉందా? మనకు ఏమి తెలిసినా, లేదా ఎవరికి తెలిసినా, మన విశ్వాసం క్రీస్తుపై మరియు ఆయన శక్తిపై మాత్రమే ఉండాలి.

పౌలు 1 కొరింథీయులకు 1:21లో తన మానవ జ్ఞానం మరియు తత్వశాస్త్రంతో కూడిన ప్రపంచం దేవుణ్ణి తెలుసుకోవడంలో విఫలమైందని పేర్కొన్నాడు, అయితే ఆయన తనను తాను బయలు పరచుకోవడానికి ఎంచుకున్నాడు మరియు బోధించే వెర్రితనం ద్వారా మానవజాతిని రక్షించాడు. దురదృష్టవశాత్తూ, కొంతమంది వ్యక్తులు ఎంత ఉన్నత విద్యావంతులైతే, వారు సరళమైన, పిల్లలలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండటం అంత కష్టమని మనం తరచుగా కనుగొంటాము. మనం జాగ్రత్తగా లేకుంటే చాలా తల జ్ఞానం (స్వబుద్ధి) మరియు తార్కికం వాస్తవానికి మనకు వ్యతిరేకంగా పని చేస్తాయి, ఎందుకంటే మనం దేవుణ్ణి కేవలం ఆత్మ మరియు హృదయం ద్వారా మాత్రమే తెలుసుకోగలము, మెదడు ద్వారా కాదు. జీవితంలోని అన్ని రంగాలలో సహాయం చేయడానికి మానవ తత్వశాస్త్రంలో కాకుండా దేవుని శక్తిపై మీ విశ్వాసాన్ని ఉంచాలని నిర్ధారించుకోండి.


ఈరోజు మీ కొరకు దేవుని మాట: మీరు మీ జీవితములో ఎదుర్కొనే ఏ అడ్డంకునైనా దేవుని శక్తి జయిస్తుంది.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon