అచ్చు నుండి బయట పడండి

అచ్చు నుండి బయట పడండి

ప్రియుడా, చెడుకార్యమును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడుచేయువాడు దేవుని చూచినవాడు కాడు (వివేచన గలవాడు లేక అనుభవము గలవాడు). —3 యోహాను 1:11

కొన్నిసార్లు ప్రపంచంలోని ప్రజలు మనము వారి ఆచరములకు అనుగుణంగా ఉండాలని కోరుకుంటారు. ఆచారము అనే పదానికి అర్ధం “రూపం లేదా పాత్రలో సమానంగా ఉండుట; ప్రస్తుత సంస్కృతులు లేదా ఆచారాలకు అనుగుణంగా ప్రవర్తించడం.”

రోమా 12:2 ఇలాచేప్తుంది, “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, …. మరియు 3 యోహాను 1:11 చెడుకార్యమును కాక మంచికార్యముననుసరించి నడుచుకొనుమని చెప్తుంది.

ప్రజలు తమ స్వంత అభద్రతా భావము వలన కొంత వరకు మనల్ని వారి అచ్చులోనికి ఇరికించుటకు ప్రయత్నిస్తారు. వారిని వేరొకరు కూడా అలాగే చేయగలిగితే వారు ఏమి చేస్తున్నారనే దానిపై వారికి మంచి అనుభూతి కలుగుతుంది. చాలా కొద్ది మందికి వారు ఎవరో మరియు ప్రతి ఒక్కరూ వారు ఎవరై యుండగలరనే సామర్థ్యం ఉంది.

మీరందరూ దానిని చేస్తున్నట్లైయితే ఈ చక్కని ప్రపంచము ఎలా ఉంటుందో మీరు ఉహించగలరా? ప్రతి వ్యక్తి తాను ఉన్నట్లుగా సురక్షితంగా ఉంటే మరియు ఇతరులు కూడా ఏమై యున్నారో వారికి తెలియజేయండి? అప్పుడు మనము ఒకరినొకరు అనుకరించడానికి వారి మర్యాదను అనుకరించటానికి ప్రయత్నించము.

మీరు ఇహలోకపు అచ్చులలో నుండి బయటికి వచ్చి క్రీస్తును అనుకరించువారుగా మీరుండునట్లు మీరు నమ్మవలెనని నేను మిమ్ములను ప్రోత్సహిస్తున్నాను!


ప్రారంభ ప్రార్థన

పరిశుద్ధాత్మ, లోకపు అచ్చుకు అనుగుణంగా ఉండే ఉచ్చులో పడకుండా నన్ను ఉంచండి. మంచిని అనుకరించడానికి మరియు క్రీస్తులా జీవించడానికి నాకు సహాయం చెయ్యండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon