
అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. —రోమా 8:37
దేవుడు మన భవిష్యత్తు కొరకు కలలు ఇస్తాడు, కానీ కొన్నిసార్లు ఆ కలలు అసాధ్యముగా అనిపించవచ్చు. అప్పుడే భయము తన స్థానమును ఆక్రమించుటకు ప్రయత్నిస్తుంది.
ఒకవేళ మీరు మీ కళలను వదిలిపెట్టరని నిర్ణయించుకున్నట్లైతే, అప్పుడు మీరు అవకాశములు తీసుకొనవలసి ఉంటుంది – మీరు ధైర్యముగా ఉండవలెను. ధైర్యము అనునది భయమును లేకుండా చేసేది కాదు; మీరు భయపడినప్పుడు ముందుకు సాగుట అని మీరు అర్ధం చేసుకొనవలెను. కాబట్టి మిమ్మును భయపెట్టే మరియు పరిస్థితులను లేక పిరికి తనమును కలిగించే పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, మీకు ధైర్యం మరియు బలమును ఇచ్చే దేవుని కృప కొరకు ప్రార్ధించండి తద్వారా మీరు భయమనే భావనలో కూడా మీరు ముందుకు వెళ్ళగలరు.
భయమనే ఆత్మ ఎల్లప్పుడు మీరు ముందుకు వెళ్ళకుండా ఆపుటకు ప్రయత్నిస్తుంది. ప్రజలను ఆపుటకు శతాబ్దాలుగా శత్రువు భయమును వాడుకుంటున్నాడు మరియు ఇప్పుడు అతడు తన పధకాలను మార్చుకోవడం లేదు. కానీ నీవు భయమును ఓడించగలవు, ఎందుకంటే మనలను ప్రేమించే క్రీస్తులో నీవు అత్యధిక విజయము పొందియున్నావు.
భయము మీకు వ్యతిరేకముగా వచ్చినప్పుడు నిర్ణయము తీసుకొనుమని నేను మిమ్మును ప్రోత్సహిస్తున్నాను. దేవుడు మీతో ఎల్లప్పుడూ ఉన్నాడని తెలుసుకొనుట ద్వారా స్థిరముగా నిలబడుము మరియు దేవుని యందు నమ్మిక యుంచుము.
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను భయపడుచున్నప్పటికీ నేను నీ వాక్యమునందు నమ్మిక యుంచుచున్నాను, మరియు నేను అత్యధిక విజయమును పొందుచున్నదానను అని నాకు తెలియజేస్తుంది. మీరు నాకు అనుగ్రహించిన ప్రతి కలను నేను నేరవేర్చగలను ఎందుకంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు మరియు విజయాన్ని అనుగ్రహిస్తున్నారు.