“ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.”- మత్తయి 11: 28-30
దేవునితో నేను నడిచే ప్రారంభ దినాలలో, నేను చాలా ఉత్సాహభరితంగా మరియు ఆసక్తితో ఆయనను సేవించాలని ఆశించే దానిని కాబట్టి నేను కూడా సుదూరంగా నాకు కనిపించే ప్రతిదానిని చేయాలని ఆశించేదానిని. దాని ఫలితమేమిటంటే నేను దేనికైతే అభిషేకించ బడ్డానో, వాటిని నేను త్వరగా కనుగొన్నాను.
నా తీరిక లేని జీవితం వల్ల నేను క్రమంగా దేవునితో సమయం గడపలేదు. నేను దేవుని కొరకు మంచి పనులను చేసాను, కానీ ఏదో ఒకవిధంగా ఆయనను విస్మరించియున్నాను. ఫలితంగా, నేను తరచూ శరీర కార్యములను చేస్తున్నందున నేను నిరాశపడుతూ ఉండేదానిని.
“శరీరకార్యములు” మన ద్వారా ప్రవహించు దేవుని శక్తి లేకుండా మనము చేసే పనులు. అవి చాలా కష్టంగా ఉంటాయి, అవి మనల్ని ఎండిపోవునట్లు చేస్తాయి, మరియు వారు ఎటువంటి ఆనందం లేదా నెరవేర్పునివ్వదు. అవి తరచుగా మంచి విషయాలు, కానీ “దేవుని విషయాలు” కాదు.
ప్రజలు వారి స్వంత బలంతో దేవుణ్ణి సేవించుటకు ప్రయత్నిస్తూ మతపరమైన కార్యకలాపాలలో పూర్తిగా నిమగ్నమై యుంటున్నారు. కానీ యేసు గొప్పపని చేయుట కొరకు చనిపోలేదు … ఆయన ద్వారా దేవుడితో ఉండటానికి మన కొరకు ఆయన చనిపోయాడు, కాబట్టి మనము తండ్రియైన దేవుడు, కుమారుడైన దేవుడు మరియు పరిశుద్ధాత్మ అయిన దేవునితో ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటాము.
దేవునితో నిజంగా ఉండేందుకు మీరు నేడు శరీర కార్యములు కొన్నింటిని కత్తిరించ వలసి యున్నదా ?
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, నిన్ను తెలుసుకొనుట యనునది నేను మంచి పనులు చేయడం ద్వారా భర్తీ చేయడం కాదని నేను గ్రహించియున్నాను. నీతో ఎక్కువ సమయం గడపడానికి పక్కన పనికిరాని పనులను ప్రక్కన పెట్టుట ద్వారా నేను నిలబెట్టుకొనుటకు నాకు సహాయపడుము.