
ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా (నాతో బలమైన ఐక్యత నుండి తృంచి వేయబడుట) ఉండి మీరేమియు చేయలేరు. —యోహాను 15:5
దేవుడు అధిక బరువును మోయునట్లు చేయుటయే నేను నేర్చుకున్న ప్రాముఖ్యమైన విషయాల్లో ఒకటి. మనలో ఏమి తప్పు ఉందనే విషయాన్ని అనేక సార్లు చూస్తూ దానిని మనమే మన స్వంత బలముతో పరిష్కరించాలని ప్రయత్నిస్తాము, కానీ ఇది ఎన్నడూ మంచిది కాదు. యేసు యోహాను 15:5 లో నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరని చెప్పాడు.
మనము స్వంతగా అన్నింటిని సమకుర్చుకొనుటకు ప్రయత్నిస్తాము కానీ మనము చేయవలసిన దానిని చేయుటకు దేవుడే మనకు తన ఐశ్వర్యములోని ప్రతి అవసరత తీర్చునట్లు అనుమతించవలెను. స్వశక్తి మరియు నిర్ణయాత్మకత మనకు ప్రారంభించుటకు సహాయపడుతుంది కానీ అవి నిజముగా చివరి వరకు నిలబడవు మరియు గందర గోళముల మధ్యలో మనలను వదిలి పెట్టి వెళ్ళిపోతాయి.
మన జీవితములోని ప్రతి పరిస్థితిలో దేవునిని ఆహ్వానించుట ద్వారా యేసు మన కొరకు మరణించి మనం ఆనందించడానికి ఇచ్చిన జీవితమును ఆనందించుట మనము నేర్చుకొనగలము. యేసు చెప్పెను, “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును” (మత్తయి 11:28 ).
మనము దేవుడు లేకుండా పనిచేయునట్లు సృష్టించ బడలేదు. మరియు ఆయనతో మనము ఏ చెడు అలవాటైనా లేక వ్యసనమైనా ఉదాహరణకు అధికముగా భుజించుట, దుర్వినియోగ పదార్దములు, సమయాన్ని సరిగ్గా వినియోగించక పోవుట, కోపముతో కూడిన సమస్యల వంటి వాటిని తృంచి వేయగలము.
ప్రారంభ ప్రార్థన
దేవా, నీవు లేకుండా నేను శూన్యమని నాకు తెలుసు, కాబట్టి నా జీవితములోని ప్రతి ప్రదేశములోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాను. నేను మిమ్మును ప్రతిరోజూ అనుసరిస్తూ మీ యందు నమ్మిక యుంచుట ద్వారా నా అధిక బరువు మీ మీద వేయుచున్నాను.