
అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును. —1 కొరింథీ 13:7
1 కొరింథీ 13:7 నిజముగా ప్రజలను ప్రేమించుట యొక్క అర్ధమును గురించి స్పష్టముగా చిత్రీకరించబడినది. ఈ లేఖనమునకు విధేయత చూపుటయనునది ఒక గొప్ప సవాలని నేను నిజాయితీగా చెప్పగలను.
నేను అనుమానస్పదంగా మరియు ప్రతి ఒక్కరిని గురించి అపనమ్మకంగా ఉండుటతో నేను ఎదిగి యున్నాను. కానీ ప్రేమ లక్షణాలను గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు మరియు ఆ ప్రేమ ఎల్లప్పుడూ ఉత్తమమును నాకు అనుగ్రహిస్తుందని నమ్మినప్పుడు నాకు ఒక కొత్త అభిప్రాయం అభివృద్ధి చెందుతుంది.
అనుమానము అనునది దైవిక సంబంధాల లక్షణములకు వ్యతిరేకముగా పని చేస్తుంది. నమ్మకం మరియు విశ్వాసము జీవితములో ఆనందమును తీసుకువస్తాయి మరియు సంబంధములు అత్యధిక బలముతో, ఎదుగుతాయి కానీ అనుమానము అనునది సంబంధమును కుంటుపడునట్లు చేస్తుంది మరియు సాధారణముగా దానిని నాశనం చేస్తుంది.
ఇప్పుడు, ప్రజలు పరిపూర్ణమైన వారనునది సత్యమే మరియు కొన్నిసార్లు మన నమ్మకం ప్రయోజనమును తీసుకుంటుంది కానీ అన్నింటినీ చూసినట్లయితే, ఎల్లప్పుడూ ప్రజలలో ఉత్తమమును చూసినట్లయితే అది ఎటువంటి వ్యతిరేక అనుభవాలకు విలువనివ్వదు.
మీరు అనుమానము గురించి పోరాడుతున్నట్లైతే ఈరోజు మనలో ఆలోచనలు తప్పు త్రోవ పడుతుంటే అద్భుతమైన పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది గుర్తుంచుకోండి. మన అనుమానస్పద ఆలోచనలు ప్రేమ పూర్వక ఆలోచనలుగా మార్చమని మనము ఆయనను అడుగుదాము.
ప్రారంభ ప్రార్థన
దేవా, ఎల్లప్పుడూ నమ్మిక లేక యుండుట మరియు ఇతరుల యెడల అనుమానమును కలిగి యుండుట అనునది మన సంబంధాలను పాడుచేస్తున్నాయని నేను అర్ధం చేసుకొనియున్నాను. నేను ఇతరులకు నా హృదయమును ఎలా తెరవాలో నాకు చూపించండి మరియు ప్రతి పరిస్థితిలో ఉత్తమమును నమ్ముట నాకు చూపించండి.