
మరియు ఆయనద్వారా మనము విశ్వాసమువలన ఈ కృప (దేవుని యందు (మనము) ప్రవేశముగల (పరిచయం, ప్రవేశం) వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి (స్థిరముగా మరియు భద్రముగా) అతిశయ పడుచున్నాము. (రోమీయులకు 5:2)
మన దైవిక జీవితంలో ప్రతి విషయము దేవునిపై మన వ్యక్తిగత విశ్వాసం మరియు ఆయనతో మనము కలిగియున్న వ్యక్తిగత సంబంధంపై ఆధారపడి ఉంటుంది, ఇది ఖచ్చితంగా ఆయన స్వరాన్ని వినగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మనం ఆ సంబంధాన్ని ఆస్వాదించగలము ఎందుకంటే యేసు సిలువ మరణము మన పరలోకపు తండ్రికి ఉచిత, అడ్డంకులు లేని ప్రవేశానిస్తుంది మరియు మన విశ్వాసం ఆయనతో సన్నిహిత, చైతన్యవంతమైన సంబంధాన్ని కలిగి ఉండడాన్ని సాధ్యం చేస్తుంది.
నేను ఎఫెసీయులు 3:12ని ప్రేమిస్తున్నాను మరియు ఇటీవల దానిని అధ్యయనం చేస్తున్నాను. ఇది ఇలా చెప్తుంది: “ఆయనయందలి విశ్వాసముచేత ధైర్యమును (ఆత్మ విశ్వాసమును) నిర్భయమైన ప్రవేశమును (స్వేచ్ఛతో మరియు భయం లేకుండా దేవుని వద్దకు వెళ్ళుట)” ఆయననుబట్టి మనకు కలిగియున్నవి. నేను ఈ లేఖనాన్ని ధ్యానిస్తున్నప్పుడు, సాధారణ మానవులుగా మనం ప్రార్థన ద్వారా ఏ సమయంలోనైనా భగవంతుని వద్దకు ఉచిత ప్రవేశాన్ని కలిగి ఉన్నామని గ్రహించడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను; మనకు కావలసిన లేదా అవసరమైనప్పుడు ఆయన స్వరాన్ని వినవచ్చు. రిజర్వేషన్లు లేకుండా, భయం లేకుండా మరియు పూర్తి స్వేచ్ఛతో మనం ధైర్యంగా ఆయనను చేరుకోవచ్చు. అది ఎంత అద్భుతం! దేవునిపై వ్యక్తిగత విశ్వాసం ఆయన నుండి అపరిమితమైన సహాయానికి మరియు ఆయనతో ఎటువంటి ఆటంకం లేని సంభాషణకు తలుపులు తెరుస్తుంది.
ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని, మీ సహవాసాన్ని కోరుకుంటున్నాడని మరియు మీ నుండి వినడానికి మాత్రమే కాకుండా, ఆయన మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడని నమ్మకంతో దేవుని దగ్గరకు రండి.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: దేవుని వద్ద నుండి వినుటకు మరియు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుటకు ఎదురు చూడండి.