అభివృద్ధి నెమ్మదిగా ఉన్నప్పుడు

అభివృద్ధి నెమ్మదిగా ఉన్నప్పుడు

అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును (సంపూర్ణ ఆనందముతో) అతిశయపడుదము.  —రోమా 5:3-4

మన మనస్సులను నూతన పరచుట ప్రాముఖ్యమైనది, కానీ మన మనస్సులను తిరిగి నుతనపరచుటకు నెమ్మది నెమ్మదిగా జరుగునని మనము గుర్తించుట ప్రాముఖ్యమైనది. ఈ ప్రక్రియ నెమ్మదిగా ఉన్నట్లయితే లేక మీకు చెడ్డ రోజులు వచ్చినట్లైతే మీరు నిరుత్సాహపడవద్దు. కేవలం వెనక్కి తిరిగి రండి, దుమ్ము దులపండి మరియు తిరిగి ప్రారంభించండి.

ఒక పసి పిల్లవాడు నడచుట నేర్చుకున్నప్పుడు, అతడు పడిపోకుండా నడచునట్లు నిలబడుటకు ముందు అనేక సార్లు పడుతూ లేస్తాడు, అయినప్పటికీ ఆ పిల్లవాడు పట్టుదలగా ఉంటాడు. అతడు పడుతున్నప్పుడు కొంత సమయం ఏడవవచ్చు, కానీ అతడు ఎల్లప్పుడూ లేచి నిలబడుటకు మరల మరలా ప్రయత్నిస్తూ ఉంటాడు.

మన ఆలోచనా విధానమును మార్చుటను నేర్చుకొనుట ఒకే విధానములో పని చేస్తుంది. మనము పోరాడతాము మరియు పడిపోతాము, కానీ దేవుడు ఎల్లప్పుడూ మనలను లేపుటకు సిద్ధంగా ఉంటాడు. మానసిక ఒత్తిడిని కలిగి యుండుట కంటే బైబిల్ ఏమి చెప్తుందో జ్ఞాపకముంచుకోండి మరియు మీ కష్టములలో “విజయము” పొందండి, ఎందుకంటే మీరు కష్టపడుట అనగా మంచి పోరాటమును పోరాడుచున్నారనునది సత్యమై యున్నది.

మన ఆలోచనలు వ్యతిరేకముగా ఉన్నప్పుడు – మనము అన్నిటినీ సరిగా చేయని రోజులు కుడా ఉంటాయి. కానీ ప్రయత్నించుట ఎప్పుడూ ఆపవద్దు. మనం వదలకుండా పట్టుకొని యున్నప్పుడు దేవుడు క్రమముగా మనలను అయన ఆలోచనా విధానములోనికి నడిపించును!


ప్రారంభ ప్రార్థన

ప్రభువా, నేను పడిపోతున్నప్పుడు నన్ను తిరిగి నిలబెట్టినందుకు వందనములు. నేను కష్టపడుతున్నప్పుడు, నా ప్రతికూల మనస్సును జయించుటకు మీరు నాకు సహాయం చేయండి మరియు నన్ను మీ ఆలోచనా విదానములోనికి మరి ఎక్కువగా నడిపించండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon