అవమానమునకు సెలవని చెప్పండి

అవమానమునకు సెలవని చెప్పండి

ఏమనగా, ఆయనయందు విశ్వాసముంచు (ఆయనలో నమికయున్చువాడు, ఆధారపడువాడు మరియు అనుకోనువారు) వాడెవడును (ఎన్నడును) సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. —రోమా 10:11

ఒక వ్యక్తికి సిగ్గు-ఆధారిత స్వభావం ఉన్నప్పుడు, నేను భావించినట్లుగా, ఇది నిరాశ, ఒంటరితనం, పిరికితనము మరియు పరాయి వారమనే భావన వంటి అనేక సంక్లిష్ట అంతర్గత సమస్యలకు మూలం లేదా మూలంగా మారుతుంది. అన్ని రకాల కంపల్సివ్ డిజార్డర్స్ సిగ్గుతో పాతుకుపోయాయి: మాదకద్రవ్యాలు, మద్యం మరియు ఇతర రసాయన వ్యసనాలు; బులిమియా, అనోరెక్సియా మరియు ఊబకాయం వంటి రుగ్మతలు; దురాశ మరియు జూదం వంటి డబ్బు వ్యసనాలు; అన్ని రకాల లైంగిక వక్రతలు-వీటి జాబితా అంతులేనిది.

కొంత మంది ప్రజలు పనిపిచ్చి వారి జీవితములో అవమానము కలిగిస్తుంది. అటువంటి పని పిచ్చి కలిగిన ప్రజలు వారి జీవితములో ఎన్నడూ ఆనందించలేరు. వారు రాత్రింబగళ్ళు పని చేయని యెడల వారు బాధ్యతా రహితముగా ఉన్నారనుకుంటారు. వాస్తవముగా కొంత మంది ప్రజలు నేను ఎలా ఉన్నానో అలా ఉంటారు – అనగా వారు తమ జీవితాల్లో ఆనందముగా ఉంటే, వారు అపరాధ భావనను కలిగి యుంటారు.

నేను చేసినట్లుగా మీరు కూడా పని పిచ్చితో బాధపడుతూ ఉంటే లేక మీరు విభిన్నమైన అవమాన ఆధారిత కష్టములలో ఉండవచ్చు. ఇక్కడ ఒక అంశము ఏదనగా అవమానము మనలను నాశనం చేస్తుంది.

కానీ మనము దానిని అనుమతించనవసరం లేదు. మనము దేవునిలో నమ్మిక యుంచినప్పుడు, ఆయన మన అవమానమును తీసి వేస్తాడు. మనము ఆయన పిల్లలముగా దేవుని సన్నిధిలో జీవించునట్లు యేసు మనలను పాపము నుండి శుద్ధి చేస్తాడు మరియు మన పొరపాటులను కప్పి వేస్తాడు.

ఒకవేళ అవమానము మీ మీద దాడి చేసినప్పుడు, మీరు ఈ సత్యమును జ్ఞాపకం చేసుకొనవలసిన సమయం ఇదియే: దేవుడు మిమ్మును ప్రేమిస్తున్నాడు, మరియు ఒకవేళ మీరు ఆయన మీద ఆధారపడుతూ, నమ్మిక యుంచి ఆనుకొని యున్నప్పుడు, ఆయన మీ అవమానమును తీసి వేస్తాడు.


ప్రారంభ ప్రార్థన

ప్రభువా, నేను నీలో విశ్వాసముంచినప్పుడు, నా అవమానముతో నేను జీవించనవసరం లేదని నేను ఎరిగి యున్నాను. నేను స్వేచ్చగా మీ సన్నిధిలో జీవించునట్లు దానిని తీసివేసినందుకు వందనములు.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon