దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు (ప్రాముఖ్యముగా మరియు పరిపూర్ణముగా నీతిమంతుడు) కాడు. —మార్కు 10:18
అవాస్తవిక అంచనాలు మన సమాధానమును మరియు ఆనందమును దొంగిలిస్తాయి. మనము వాస్తవముగా మంచి మనుష్యులతో, మన చిన్న పరిపూర్ణ ప్రపంచములో పూర్తిగా ఆనందముగా ఉండే ఒక మంచి దినము కొరకు ఎదురు చూస్తాము, కానీ అది వాస్తవము కాదని మనందరికీ తెలుసు. వాస్తవముగా, దేవుడొక్కడే పరిపూర్ణుడు మరియు మనమందరము నిర్మాణములో ఉన్న వారమే.
మన సమాధానమును ఏది దొంగిలిస్తుందనే విషయము సాతానుడికి తెలుసు మరియు మన అవాస్తవిక ఆశలను దూరం చేసినప్పుడు అతడు నిరాశ పడతాడు.
నా సమాధానమును దొంగిలించుటకు సాతానుని అనుమతించిన సంవత్సరాల తరువాత నేను చివరకు దానిని పొందుకున్నాను; మనము సరియైన ప్రణాళికను కలిగి యుండకుండా ఉన్నప్పుడు జీవితము పరిపూర్ణము కాదు. నా నూతన వైఖరిని కలిగి యున్నాను, చాలా బాగుంది మరియు అదియే నా జీవితం! ఆ విషయాలు నన్ను సంతోష పెట్టుటకు అనుమతించకుండా ఉన్నప్పుడు అవి నన్ను దుఃఖ పెట్టవని నేను గుర్తించాను.
ప్రతి ఒకరి ప్రతికూలతలతో వ్యవహరించవలెను, కానీ మనము వాటితో వ్యవహరించగలము మరియు ఒక చెడ్డ వైఖరిని వదిలి పెట్టగలము. ఈరోజు కేవలం దేవుడు మాత్రమే పరిపూర్ణుడని మరియు ఆయన యందు నమ్మిక యుంచుట నేర్చుకొనవలెనని జ్ఞాపక ముంచుకొనుము. ఆయన మిమ్మును ఎల్లప్పు డు గత పరిస్థితుల గుండా తీసుకొని వెళ్లి మీరు సమాధానమును పట్టుకొని యుండుటకు బలపరచి సహాయం చేయును.
ప్రారంభ ప్రార్థన
దేవా, మీరు మాత్రమే పరిపూర్ణులు. ప్రజలు లేక పరిస్థితులు కూడా విఫలమైనప్పుడు మీరు విఫలం కారని నేను ఆనందిస్తున్నాను. నేను నిరశాపరచే విషయాలపై నా నిరీక్షణనుంచక నీలో నిరీక్షణ ఉంచుట ద్వారా వచ్చే సమాధానకరమైన జీవితమును ఎంపిక చెసుకొని యున్నాను.