ఏలయనగా, మత్సరమును వివాదమును (శత్రుత్వము) ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు (అశాంతి, అసమ్మతి, తిరుగుబాటు) ప్రతి నీచకార్యమును ఉండును. —యాకోబు 3:16
అసూయ వలన పుట్టిన కోపము బైబిల్లో ప్రస్తావించబడిన మొదటి ప్రతికూల ఉద్రేకముగా ఉన్నది. ఆదికాండము 4వ అధ్యాయము మనకు తెలియజేయునదేమనగా కయీనుకు అతని సహోదరుడైన హేబెలు మీద పుట్టిన అసూయ కోపముగా మారి అతనిని హతమార్చాడు. ఇది అసూయ యొక్క తీవ్ర ఫలితాలలో ఒకటి అయినప్పటికీ, అసూయ ఎంత ప్రమాదకరమైనదో అది మనకు గుర్తు చేస్తుంది.
ఈరోజు సమాజములో చాలా మంది ప్రజలు తమ విలువను లేక ప్రాముఖ్యతను తమ ఉద్యోగమును, సామజిక గుర్తింపు లేక సంఘములో వారి స్థాయిని గురించి భావిస్తున్నారు. ఈ మనస్తత్వము వలన మరొకరు వారి కంటే గొప్ప స్థానమును పొందుకుంటారేమోనని భయపడుతున్నారు. అసూయ వారిని మనుష్యుల యెదుట ప్రాముఖ్యమైన వారుగా ఉండునట్లు చేస్తుంది.
మీరు ఈ వైఖరితో కలవరపడుతున్నట్లైతే దేవుడు మిమ్మును ఒక కారణము నిమిత్తము ఏర్పరచుకున్నాడని అర్ధం చేసుకోండి. ఆయన మీ విషయంలో గొప్ప ప్రణాళికను కలిగియున్నాడు మరియు మీరు ఆ ప్రణాళిక నిమిత్తము సిద్ధపడుటకు మీకు అవసరమైన దానిని ఆయన ఎరిగి యున్నాడు.
మీరు చిన్న ఆరంభములను మర్చిపోవద్దు. దేవుడు మనలను పిలిచిన పిలుపుకు తగినట్టుగా విదేతయ చూపితే మన ఆనందము మరియు నెరవేర్పును పొందుకుంటాము కానీ అసూయతో ప్రజలను సంతోషపెట్టే పనులు చేయుటకు ప్రయత్నించుట ద్వారా పొందలేము. మీలో అసూయ ఎదగకుండా చూడండి. మీరు ఎక్కడ ఉండాలో అక్కడ మిమ్మును ఉంచునట్లు దేవుని యందు నమ్మిక యుంచండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, అసూయ అనునది అపాయకరమైనది మరియు నేను అందులో ఎటువంటి భాగమును కలిగి యుండాలని నేను ఆశించుట లేదు. నా స్థితి లోకపరమైన స్థానములు మరియు గుర్తింపుల మీద ఆధారపడి యుండలేదు. నీవు మాత్రమే నాకు అవసరమై యున్నావు.