
నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు. –యిర్మీయా 29:11
మన మీద మనము జాలి పడుట యనునది ఒక నాశనకరమైన మరియు ప్రతికూల భావావేశం. అది మన ఎదుట ఉన్న ఆశీర్వాదములు మరియు సంభావ్యతల నుండి మనకు గ్రుడ్డి తనమును కలుగ జేస్తుంది మరియు ఈరోజు మరియు రేపటి నిరీక్షణను దొంగిలిస్తుంది. తమ మీద తామే జాలి పడే ప్రజలు అప్పుడప్పుడు నేను దేనినైనా ఎందుకు చేయాలి? నేను కేవలం విఫలమవుతాను అని ఆలోచిస్తారు.
స్వీయ శ్రద్ధ అనునది ఒక విగ్రహారాధన వంటిది ఎందుకంటే అది మనమీద మనకు ఎక్కువ శ్రద్ధ చూపుటలో తారాస్థాయికి చేరుతాము. మనలను మనము స్వీయ జాలిలోనికి అనుమతించినట్లైతే మనము ప్రత్యేకముగా దేవుని ప్రేమను మరియు మార్పు నొందుటకు ఆయన సామర్ధ్యమును తిరస్కరిస్తున్నాము.
స్వీయ జాలితో మీరు మీ జీవితములో మరొక రోజును వ్యర్ధం చేయవద్దు. మీరు నిరీక్షణను కోల్పోయినప్పుడు మరియు మీగురించి జాలిపడుట.
ప్రారంభించినప్పుడు ఆగి ఇలా పలకండి, “నా గురించి నేను జాలిపడుటను తిరస్కరిస్తున్నాను. నేను నా జీవితములో చాల కష్ట పరిస్థితులలో ఉండవచ్చు కానీ, నేను ఉత్తమ విషయాలను గురించి ఆశించుట మాత్రము నేను ఆపను!”
దేవుడు మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులు మేలు కొరకు మరియు మీకు నిరీక్షణను కలిగించుటకే. మీరు యేసులో మీ నిరీక్షణను కలిగి మీ నిరీక్షణను గట్టిగా పట్టుకున్నప్పుడు, మీ జీవితములో అద్భుతమైన విషయాలు జరుగును!
ప్రారంభ ప్రార్థన
దేవా, నా గురించి నేను జాలి పడుటను నేను తిరస్కరిస్తున్నాను. పరిస్థితులు కష్టముగా ఉన్నప్పడు, మీరు నా సమస్యలకంటే పెద్ద వాడవని మరియు నా కొరకు నీవు గొప్ప భవిష్యత్తును కలిగియున్నావని నేను జ్ఞాపకం చేసుకున్నాను. మీ ప్రణాళికలు నా జీవితంలో నేరవేర్చబడాలని ఆశిస్తూ ఆయనలో నమ్మిక యుంచు చున్నాను.