ఆత్మ vs. శరీరము

ఆత్మ vs. శరీరము

నేను చెప్పునదేమనగా (పరిశుద్ధ) ఆత్మాను [ఆత్మకు ప్రతిస్పందించడం మరియు నియంత్రించడం మరియు మార్గనిర్దేశం చేయడం] సారముగా (అలవాటు ప్రకారము) నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను (దేవుడు లేకుండా ఉండే శారీరక ఆశలు) నెరవేర్చరు. (గలతీ 5:16)

తన యజమాని స్వరానికి తన చెవిని ఎల్లప్పుడూ అనుగుణంగా ఉంచడానికి శిక్షణ పొందిన గుర్రం వలె, మనం అనుకూలముగా భావించే లేదా అంగీకరించే వాటితో మాత్రమే కాక మనం ప్రభువును అనుసరించడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన చేయమని చెప్పేది మనం ఎప్పుడూ చేయుటకు ఇష్టపడము.
దేవునిని వెంబడించలంటే, శరీరానికి కొన్ని సమయాల్లో కాదని చెప్పాలి మరియు అది జరిగినప్పుడు, శరీరం బాధపడుతుందని మనం గ్రహించాలి. మనము ఒక దిశలో పూర్తి వేగంతో ముందుకు దూసుకుపోతున్న సందర్భాల్లో , అకస్మాత్తుగా యజమానుడు మమ్మల్ని ఆగమని చెప్పుట మరియు మరొక దిశలో వెళ్ళమని సూచించిన సందర్భాలున్నాయి. మన మార్గాన్ని మనం పొందలేనప్పుడు ఇది మనకు బాధాకరంగా ఉంటుంది, కానీ చివరికి దేవుని మార్గాలు ఎల్లప్పుడూ ఉత్తమమైనవని మనం అర్థం చేసుకుంటాము.

ఈ దినపు వచనంలో, అపొస్తలుడైన పౌలు, ఆత్మ మరియు శరీరానికి మధ్య సంఘర్షణ గురించి వ్రాశాడు. మనము ఆత్మ నడిపింపును అనుసరిస్తే, దేవుని ఉత్తమమైన వాటి నుండి మనలను నడిపించే శరీర కోరికలను మనం సంతృప్తిపరచలేము లేదా నెరవేర్చలేము. ఈ వచనం శారీరక కోరికలు అదృశ్యమవుతాయని చెప్పలేదు; మనము ఎల్లప్పుడూ వారితో యుద్ధం చేయవలసిఉంటుంది. కానీ మనం ఆత్మచేత నడిపించబడాలని ఎంచుకుంటే, మనం శరీర కోరికలను నెరవేర్చుకోలేము మరియు సాతానుడు తన మార్గమును కోల్పోతాడు.

మనం దేవుని నడిపింపును అనుసరించాలని ఎంచుకున్నప్పుడు మనలో యుద్ధం జరుగుతుందని మనం గ్రహిస్తాము. మన శరీరము మరియు దేవుని ఆత్మ సాధారణంగా ఏకీభవించవు మరియు శరీరాన్ని సౌకర్యవంతంగా ఉంచడానికి మనం శోదించబడతాము. కానీ, మనమందరం దేవుని ఆత్మకు లోబడడం మరియు శారీరక కోరికలు మరియు శోధనలను అధిగమించడం నేర్చుకోవాలి. మీరు మీ శరీరాన్ని నడిపించనివ్వరని, కానీ మీరు దేవుని ఆత్మచే నడిపించబడతారని ఈ రోజు నిర్ణయించుకోండి.


ఈరోజు మీ కొరకు దేవుని మాట: దేవుడు అతని ఉత్తమత్వమును అనుగ్రహించాలని ఆశిస్తున్నాడు.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon