ఆయన దానిని అన్నిటిని కలిపి పట్టుకుంటాడు

ఆయన దానిని అన్నిటిని కలిపి పట్టుకుంటాడు

ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.  —కొలస్సీ 1:17

కొలస్సీ 1:17 ఒక గంభీరమైన లేఖనమై యున్నది. సమస్తమును యేసు ఆధీనములో ఉన్నదని ఈ వాక్యము మనకు సెలవిస్తుంది. ఆహా! సమస్తమును అయన చేతిలో ఉన్నవని ప్రజలు కుడా గుర్తించలేరు.

దీనిని గురించి ఆలోచించండి. యేసు వివాహములను తన స్వాధీనములో ఉంచుకొనకుండా ఉన్నట్లయితే మనము మంచి వివాహములను కలిగి యుండలేము. ఒకవేళ యేసు మన వ్యక్తిగత సంబంధములను కలిపి పట్టుకోనకుండా ఉన్నట్లయితే మనము మంచి సంబంధములను కలిగియుండలేము.  యేసు లేకుండా మన ఆర్ధిక విషయాలు చాలా గందర గోళముగా ఉండేవి.  యేసు లేకుండా సమస్తమును ఒక గందర గోళముగా ఉండును.

ఒకవేళ యేసు మన జీవితములో ప్రాముఖ్యమైన వ్యక్తిగా మన జీవితములో లేనట్లైతే, అప్పుడు మన ప్రాధాన్యతలను మనము తిరిగి పునర్నిర్మించుకోవాల్సి ఉంటుంది. మత్తయి 6:౩౩ మనకు తెలియజేయునదేమనగా మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకుమని చెప్పాడు ఎందుకనగా మనము మొదటి విషయాలను మొదట ఉంచము అప్పుడు సమస్తమును క్రమముగా లేకుండా మనకు సమస్యలను సృష్టించును. దేవుని మార్గములో ఉంటూ పని చేయుచు మరియు అయన రాజ్యమును వెదకుచు ఉన్నట్లయితే – అయన కోరిన విధముగా పనులు చేయుటను కనుగొంటాము – అనగా ప్రజలతో ఎలా వ్యవహరించాలి, పరిస్థితులతో ఎలా వ్యవహరించాలి, డబ్బులు ఎలా ఖర్చు చేయాలి, ఎటువంటి వైఖరిని కలిగియుండాలి, మరియు ఎటువంటి వినోదం మనకు ఉత్తమముగా ఉంటుంది అనే విషయాలలో దేవుని మార్గములో నడచుకొనగలము.

ఈ దినమందే మీ జీవితములో దేవునికి మొదటి స్థానము ఇవ్వడం ప్రారంబించండి.  ఆయన మీకు చెందిన సమస్తమును పట్టుకొని యుండును… ఆయనను అనుసరించునట్లు అయన మిమ్మును సృష్టించాడు. ఆయనను మీ జీవితములో మొదటి స్థానంలో ఉంచండి.

ప్రారంభ ప్రార్థన

దేవా, నీవు లేకుండా నేను లేను. నీవు నన్ను పట్టుకొనుము… వాస్తవముగా నీవు సమస్తమును కలిపి పట్టుకొనియున్నాను. మీరు నా జీవితములో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు మరియు మిమ్మల్ని నా జీవితములో మొదటి స్థానములో ఉంచి యున్నాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon