ఆయన నామంలో ప్రార్ధించుట

ఆయన నామంలో ప్రార్ధించుట

… ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు; మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.  ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును.  –యోహాను 16:23-24

మా చిన్న కుమారుడు స్కూలులో ఉన్నప్పుడు, డేవ్ మరియు నేను ప్రయాణించేటప్పుడు, అతనితో చూసుకోవడానికి మాకు కొంత మంది జనాలు ఉన్నారు. మేము లేని సమయంలో అవసరమైనప్పుడు అతనికి వైద్య సహాయం అందించుటకు మరియు నిర్ణయాలు తీసుకునేందుకు మా స్థానంలో మా కొడుకు తరఫున మా పేరును ఉపయోగించడానికి హక్కు ఉందని సూచించే చట్టబద్ద పత్రంలో మేము సంతకం చేయాల్సి వచ్చింది.

యేసు తన శిష్యుల కోసం, అంతిమంగా ఆయనపై నమ్మకం ఉన్న వాళ్ళందరికీ అదే విధంగా చేశాడు. మనము ఆయన నామములో ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిస్తానని చెప్పాడు. ఇది ఆయన నామములో మీకు మరియు నాకు ఇవ్వబడిన అధికారం.

ఆయన నామము ఆయన స్థానమును తీసుకుంటుంది–ఆయన నామము ఆయనను సూచిస్తుంది. మనము ఆయన నామములో  ప్రార్థన చేసినప్పుడు, అతను ప్రార్ధిస్తూ ఉన్నట్లే ఉంటుంది. ఈ ఆధిక్యత నమ్మడానికి చాలా అద్భుతంగా ఉంది! కానీ మనము దానిని నమ్మాలి ఎందుకంటే మనము దానిని పొందుటకు లేఖనములను కలిగి యున్నాము కనుక యేసు నామము యొక్క అధికారాన్ని ఉపయోగించుకోండి మరియు చెడును అధిగమించడానికి మరియు ఈ ప్రపంచానికి దేవుని ఆశీర్వాదాలను తీసుకురావడానికి పనిచేయడానికి ఆ శక్తిని ఉపయోగించండి.

ప్రారంభ ప్రార్థన

దేవా, మీరు ప్రార్థనలు వింటారని మరియు జవాబిచ్చుటకు సిద్ధంగా ఉన్నారని నేను యేసు నామములో ధైర్యముగా ప్రార్ధిస్తున్నాను.  నీ కుమారుని నామంలో ప్రార్థించే అద్భుతమైన ఆధిక్యతను బట్టి ధన్యవాదాలు.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon