
వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యెహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; యేసు నా గొఱ్ఱ పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. (యోహాను 21:15)
నేటి వచనంలో యేసు పేతురును, “నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. నిజానికి, యేసు పేతురును ఇదే ప్రశ్నను మరో రెండుసార్లు అడిగాడు. మూడవసారి, యేసు అదే ప్రశ్న అడుగుతున్నాడని పేతురు బాధపడ్డాడు. అతడు, “అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు” అన్నాడు.
అప్పుడు, యోహాను 21:18లో, యేసు తనను ప్రేమిస్తున్నావా అని పేతురును అడిగే కారణాన్ని మనం కనుగొంటాము: “యేసు నా గొఱ్ఱలను మేపుము. నీవు యవనుడవై యుండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్లుచుంటివి; నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసికొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను.
నాకు నా స్వంత ప్రణాళిక ఉంది మరియు నా స్వంత మార్గంలో నడుస్తున్నందున దేవుడు ఈ లేఖనముతో నన్ను సవాలు చేశాడు. మనకు నిజంగా దేవుని పరిపూర్ణ చిత్తం కావాలంటే, మనం చేయకూడని పనులు చేయమని ఆయన మనల్ని అడగవచ్చు. మనము ఆయనను నిజంగా ప్రేమిస్తే, ఆయన మనకు ఏమి చెప్పాడో అదే చేస్తాము మరియు మన జీవితాల్లో ఆయన మార్గాన్ని కలిగి ఉండనివ్వండి.
యోహాను 21:18 నుండి యేసు మాటలు మాట్లాడినప్పుడు, మనం క్రైస్తవ యౌవనస్థులుగా ఉన్నప్పుడు, మరియు ఇప్పుడు మనకంటే తక్కువ పరిణతి చెందినప్పుడు, మనకు నచ్చిన చోటికి వెళ్లామని ఆయన మనకు చూపిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. క్రైస్తవ్యములో శిశ్యులుగా ఉన్నప్పుడూ, మనము చేయాలనుకున్నది చేశాము. కానీ మనం పరిపక్వత చెందుతున్నప్పుడు, మనం మన చేతులు చాచి దేవునికి అప్పగించాలి. మనం వెళ్లకూడదనుకునే ప్రదేశాలకు ఆయనను అనుసరించడానికి మనం సిద్ధంగా ఉండాలి.
ఆయన మనల్ని ఎక్కడికి నడిపించినా ఆయనను వెంబడించడానికి త్వరపడదాం.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: ఇది మిమ్మల్ని ఎటు నడిపిస్తున్నప్పటికీ ఈరోజు మీరు దేవునితో శాశ్వతమైన “అవును” అని చెప్పగలవా?