ఆయన వాక్యము ద్వారా మీరు దేవునికి చెవియొగ్గండి

ఆయన వాక్యము ద్వారా మీరు దేవునికి చెవియొగ్గండి

నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాని స్థిరపరచుము. (కీర్తనలు 119:38)

దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు మరియు ఆయన వాక్యం మన దైనందిన జీవితంలో మనకు సహాయం చేయడానికి, నడిపించడానికి మరియు ప్రోత్సహించడానికి రూపొందించబడింది. మనము వివిధ పరిస్థితులలో ప్రార్థన చేయడానికి బైబిల్ వచనాలు లేదా భాగాలను కనుగొనగలము కాబట్టి మనం ప్రతి సందర్భంలోనూ ఆయన స్వరాన్ని వినగలుగుతాము. కొన్నిసార్లు వచనాలు లేదా భాగాలు మనకు అసాధారణమైన నిర్దిష్టమైన, వివరణాత్మకమైన నిర్దేశాన్ని ఇస్తాయి. ఇతర సమయాల్లో మనం జ్ఞానాన్ని లేదా సాధారణ ఆధ్యాత్మిక సూత్రాన్ని తీసుకొని, మనం వ్యవహరించే విషయానికి వర్తింపజేయాలి. ఉదాహరణకు, శత్రువు మనల్ని బెదిరించే అనేక సాధారణ, నిర్దిష్ట పరిస్థితులు మరియు భావోద్వేగాలు మరియు ప్రతి సందర్భంలో ప్రార్థన చేయడానికి సంబంధిత వాక్యములు క్రింద జాబితా చేయబడ్డాయి:

  • మీరు కష్ట కాలంలో లేదా మిమ్మల్ని అలసిపోయిన సమయాల్లో, మీరు యెషయా 40:29వ వచనలోని ప్రార్ధనను ప్రార్థించవచ్చు: “సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే”.
  • మీరు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నప్పుడు, “రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక యున్నది” అని చెప్పే యిర్మీయా 31:17ని మీరు ప్రార్థించవచ్చు.
  • మీరు ఆర్థికంగా కష్టపడుతున్నప్పుడు, మీరు కీర్తన 34:9–10ని ప్రార్థించవచ్చు, ఇది ఇలా చెబుతోంది, “యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు.”

మనకు ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు దేవుని వాక్యం సమాధానం మరియు ప్రతి అవసరాన్ని తీర్చగల జ్ఞానాన్ని కలిగి ఉందని నేను నిజంగా నమ్ముతున్నాను.


ఈరోజు మీ కొరకు దేవుని మాట: ఉద్రేకములు మిమ్మల్ని దారి తప్పునట్లు చేస్తాయి, కానీ దేవుని వాక్యము భద్రతకు నడిపిస్తుంది.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon