యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు. —విలాపవాక్యములు 3:22-23
ప్రతి రోజు గతము యొక్క తలుపులు మూసివేసి, సరికొత్త ప్రారంభాన్ని అనుభవించడానికి ఒక కొత్త అవకాశం ఉంటుంది. దేవుడు రోజును ఇరవై నాలుగు గంటల విభాగాలుగా విభజించాడనే వాస్తవం ద్వారా మనం ప్రతి రోజూ నూతనముగా ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఎల్లప్పుడూ క్రొత్త రోజు, కొత్త నెల మరియు కొత్త సంవత్సరం ఉంటుంది. కానీ ఈ క్రొత్త ఆరంభాలను మనం ఉపయోగించుకోవాలంటే, మనం అలా నిర్ణయం తీసుకోవాలి.
మీరు అపరాధ భావన మరియు శిక్షా విధితో పోరాడుతున్నారా? మీరు అనేక సంవత్సరాల క్రితం చేసిన దాని గురించి లేదా నిన్న జరిగిన దాని గురించి మీకు చెడుగా అనిపిస్తుందా? ఎంత సమయం గడిచినా, గతం ఇప్పటికీ గతమే. జరిగినది ఎప్పుడో జరిగి పోయింది, మరియు దేవుడు మాత్రమే ఇప్పుడు దానిని జాగ్రత్తగా చూసుకొనగలడు. మీ తప్పు, పశ్చాత్తాపమును మీరు ఒప్పుకున్నట్లయితే, దేవుని క్షమాపణ స్వీకరించగలరు మరియు అందులో కొనసాగగలరు.
విలాపవాక్యములలో, ప్రతి ఉదయము దేవుని వాత్సల్యత మనమీద నూతనముగా పుట్టుచున్నదని ప్రవక్తయైన యిర్మీయా మనలను ప్రోత్సహిస్తున్నాడు. ఆయన మనకు ప్రతిరోజూ నూతన ఆరంభమునిస్తున్నాడు. దేవుడు అనుదినము నూతన కృపను అనుగ్రహిస్తున్నాడు – మనకు ప్రతిదినము ఒక నూతన ప్రారంభమును అనుగ్రహిస్తున్నాడు!
ప్రారంభ ప్రార్థన
దేవా, ప్రతి ఉదయము మీ వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నందుకు వందనములు! నా యెడల మీ ప్రేమ, కనికరము, కృప మరియు మీ విశ్వాస్యతను బట్టి ప్రతి దినమును నేను తాజాగా ప్రారంభించగలను!