
జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్య కరమైనవి. —సామెతలు 16:23-24
సామెతలు 16:23-24 మనకు చూపునదేమనగా ఆలోచనలు మరియు మాటలు ఒకదానితో ఒకటి సన్నిహితముగా అనుసంధానమైనవి. అవి ఎముక మరియు మూలుగ వలె ఉన్నాయి – అవి చాలా సన్నిహితముగా ఉంటాయి కనుక వాటిని విడగొట్టలేము (హెబ్రీ 4:12 చుడండి). దీని కారణముగా, మనకు ఆహ్లాదకరమైన ఆలోచనలు ఉన్నట్లయితే మన మాటలు కూడా అలాగే ఉంటాయనునది చాల ప్రాముఖ్యమైనది.
మన ఆలోచనలు నిశ్శబ్దమైన మాటలు కాబట్టి మనము మరియు దేవుడు మాత్రమే వింటాము, కానీ ఆ మాటలు మన అంతరంగ పురుషుని, మన ఆరోగ్యమును, మన సంతోషమును మరియు మన వైఖరిని ప్రభావితము చేయును. మనము ఆలోచించే విషయాలు కొన్నిసార్లు మనలను మూర్ఖులుగా చూపిస్తాయి, కానీ మనము దేవుని మార్గములో జీవించినట్లైతే, మన ఆలోచనలు మరియు మాటలు మన జీవితములను అత్యధిక ఆనందముగా చేయును.
మీ ఆలోచన జీవితమును లోకపరమైన దిశలో నడిపించుటకు అనుమతించే పొరపాటులను మీరు చేయవద్దు మరియు దైవిక మాటలు పలుకుట ద్వారా దానిని కొట్టి పడవేయండి. ఆ రెండు సంతోషపెట్టేవిగా ఉండాలి లేదా రెండును వ్యతిరేక మరియు పాప సహితముగానైనా ఉంటాయి. అక్కడ మధ్య భూభాగము ఏదియు ఉండదు.
క్రీస్తు యొక్క మనస్సుతో పని చేయుట ప్రారంభించండి మరియు అప్పుడు మీరు నూతన జీవిత పరిధిలో అడుగు పెడతారు. దేవుడు మీ ఆలోచనలను సరిచేయునట్లు ఆయనకు అనుమతి నిచ్చుటలో మీరు సమయాన్ని గడుపు చుండగా మీరు మంచి మాటలు మాటలాడుటకు ఆలోచించవలసిన అవసరం లేదు. అది కేవలం స్వాభావికంగానే సంభవిస్తుంది!
ప్రారంభ ప్రార్థన
దేవా, నా ఆలోచనలు మరియు నా మాటలు అనుసంధానమై యున్నవని నేను గుర్తించాను. నేను బయట కనపడునది అంతరంగములో ఉన్నది కాదని ప్రయత్నించి విఫలమవ్వాలని ఆశించుట లేదు. నా ఆలోచనలను నేను సరిచేసుకుంటాను తద్వారా నేను ఆహ్లాదకరమైన మాటలను నేను మాట్లాడగలను.