ఇక్కడ సహాయం కలదు

ఇక్కడ సహాయం కలదు

నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, (ఆలోచనకర్త, సహాయకుడు, విజ్ఞాపనకర్త, న్యాయవాది, బలపరచువాడు మరియు ప్రతినిది) అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. (యోహాను 14:16)

అనేకమంది ప్రజలు యేసును తన స్వంత రక్షకుడు మరియు ప్రభువుగా అంగీకరించారు. వారు పరలోకమునకు వెళ్తారు, కానీ వారికి అందుబాటులో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క పూర్తి సామర్థ్యాన్ని ఎప్పటికీ పొందరు లేదా వారు భూమిపై ఆనందించాలని దేవుడు కోరుకుంటున్న నిజమైన విజయాన్ని అనుభవించరు. సరళంగా చెప్పాలంటే, చాలామంది పరలోకమునకు వెళతారు, కానీ వారు యాత్రను ఆస్వాదించరు.

మనము తరచుగా ఆస్తి, స్థాయి, అధికారం ఉన్నవారిని చూస్తాము మరియు వారిని “విజయవంతం”గా పరిగణిస్తాము. కానీ విజయవంతంగా పరిగణించబడుతున్న చాలా మందికి ఇప్పటికీ సమాధానము, ఆనందం, సంతృప్తి మరియు ఇతర నిజమైన ఆశీర్వాదాలు లేవు. అలాంటి వ్యక్తులు పరిశుద్ధాత్మ శక్తిపై పూర్తిగా ఆధారపడటం నేర్చుకోలేదని అర్ధం.

స్వయం సమృద్ధి కలిగిన వ్యక్తులు తరచుగా దేవునిపై ఆధారపడటం బలహీనతకు సంకేతం అని అనుకుంటారు. కానీ సత్యం ఏమిటంటే, పరిశుద్ధాత్మ యొక్క సామర్థ్యమును వినియోగించుకొనుట ద్వారా, వారు తమ స్వంత శక్తితో పని చేయడం ద్వారా వారు తమ జీవితాల్లో ఎన్నడూ చేయగలిగే దానికంటే ఎక్కువ సాధించగలరు.

మనము బలమును కలిగి యున్నప్పటికీ, మనము బలహీనతలను కూడా కలిగి యున్నాము గనుక మనకు ఆయన సహాయం అవసరమై యున్నట్లుగా ఆయన మనల్ని సృష్టించాడు. ఆయన మనకు దైవిక సహాయకుడిని, పరిశుద్ధాత్మను మనలో నివసించుటకు పంపి యున్నాడు కనుక ఆయన మనకు సహాయం చేయాలని ఆశించి యున్నాడు.

మనకు అందుబాటులో ఉన్న సహాయం అందనందున మనము తరచుగా అనవసరంగా కష్టపడుతున్నాము. మీ స్వంత బలం మీద కాకుండా ఆయనపై ఆధారపడాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీరు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా మీరు ఒంటరిగా వెళ్లవలసిన అవసరం లేదు.


ఈరోజు మీ కొరకు దేవుని వాక్యము: దేవునితో మీ ఈ రోజు నిష్ర్పయోజనమైన అది ఆయన లేని మీ ఉత్తమ రోజు కంటే ఉత్తమముగా ఉంటుంది. పరిశుద్ధాత్మ మీతో మాట్లాడటానికి మరియు ఈ రోజు మీకు అవసరమైన ప్రతి విధానములో మీకు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నారు

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon