
వెల యియ్యక నేను తీసికొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్లమును ఎడ్లను ఏబది తులముల వెండికి కొనెను. —2 సమూయేలు 24:24
దేవుని ఆర్ధిక వ్యవస్థలో చౌక అనేది ఏమి ఉండదని నేను నమ్ముతున్నాను. దేవుడు తన ఏకైక కుమారుని మనకు ఉచితముగా అనుగ్రహించి యున్నాడు మరియు మనము ఆ త్యాగమునకు ఏదియు సమానము కాదు కనుక మనకు విలువైన దానిని మనము ఆయనకు త్యాగపూర్వకముగా అర్పించవలసి యున్నది. రాజైన దావీదు తాను వెల పెట్టక కొనినది ఏదియు దేవునికి ఇవ్వనని చెప్పాడు. నిజముగా ఇచ్చుట అనునది నేను దానిని భావించని యెడల అది నిజమైన అర్పణ కాదని నేను నేర్చుకున్నాను.
మనము వాడిన దుస్తులు మరియు ఇంటి వస్తువులు ఇవ్వడం ఒకవేళ మంచి గుర్తే కానీ అది నిజమైన ఇవ్వడం కాదు. నిజముగా ఇవ్వడం అనేది నేను ఉంచుకోవాలని ఆశించిన దానిని నేను ఇతరులకు ఇవ్వడమే.
మీరు ఇష్టపడే వాటిని దేవుడు ఇచ్చేయమన్నప్పుడు మీరు కూడా శోధన సమయంలో గుండా వెళ్లి ఉంటారని నేను ఖచ్చితముగా అనుకుంటున్నాను. కానీ దేవుడు మన యెడల తాను కలిగియున్న ప్రేమ ద్వారా ఆయన తన అద్వితీయ కుమారుని ఇచ్చుటను దేవుడు జ్ఞాపకం చేసుకొన్నప్పుడు మీకు చెందిన వాటిని కూడా ఇవ్వాలని మీకు అనిపిస్తుంది కదా?
ఒక సులభమైన సత్యము ఇదే: మనము సంతోషముగా ఉండునట్లు ఇవ్వాలి, మరియు మనము ఇచ్చే దానికి వెల చెల్లించని యెడల అది నిజమైన ఇచ్చుట కాదు.
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను ఇచ్చునది అర్ధవంతమై యుండాలి. నేను ఎప్పుడు మరియు ఏమి ఇవ్వాలనేది సహాయపడుటకు ఇవ్వాలా లేక కేవలం ఒకరిని ఆశీర్వదించుటకు ఇవ్వాలో నాకు తెలియ జేయుము. మీరు మీ ప్రేమను నాకు అనుగ్రహించినట్లుగానే నేను కూడా ఇతరులకు ఇవ్వాలని ఆశిస్తున్నాను.