ఇతరులను చేరుకొనుట

ఇతరులను చేరుకొనుట

ఆశించినదానిని ఆకలిగొనినవానికిచ్చి శ్రమపడినవానిని తృప్తిపరచినయెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నమువలె నుండును.    —యెషయా 58:10

గాయపడిన మరియు అవసరతలో ఉన్న ప్రజల యెడల దేవుడు ఎంతో శ్రద్ధను కలిగియున్నాడు. సంవత్సరాలు జరుగుతుండగా నేను ఆయనకు సమీపమవుతుండగా ఆయన యెడల నేను కలిగియున్న ప్రేమ పెరుగుతుంది మరియు నేను ప్రతిరోజు ఇతరుల జీవితమును ఉన్నతముగా చేయునట్లు నేను జీవించాలని నిర్ణయించుకున్నాను. దేవుని భారము నా భారమైయున్నది.

ఇతరులను పట్టుకొనుటకు మనము కొంత పెదవులతో పని చేయుట కాదు. క్రైస్తవ జీవితమును జీవించుట ఉన్నతమైన ప్రాధాన్యతయై యున్నది.

మనము ఇతరుల కొరకు పని చేయుటకు నిర్ణయము మరియు సమర్పణ అవసరము, కానీ మనము ఆ విధముగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. మీరు నిజముగా ఇతరుల కొరకు ఇచ్చుట మరియు మిమ్మును మీరు సమర్పించుకొనుట ద్వారా ఆయన మిమ్మును ఉపయోగించుకుంటాడని దేవుడు చెప్తున్నాడు. ఆశించిన దానిని ఆకలిగొనినవానికిచ్చి శ్రమపడినవానిని తృప్తిపరచిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నమువలె నుండును. (యెషయా 58:10).

మీరు పరిస్థితులను అధిగమించి ఇతరులకు క్రీస్తు ప్రేమను అందించిన యెడల మీ ఆనందము మరియు సమాధానము అధికమవుతుంది మరియు మీరు ఎదుర్కొంటున్న పోరాటములు కనుమరుగవుతాయి. మార్పును కలిగించుట ద్వారా లెక్కించదగిన చోట అద్భుతమైన తృప్తిని మీరు అనుభవిస్తారు.

కాబట్టి దీనిని గమనించండి: దేవుని భారము మీ భారముగా చేసుకొనుటకు గాను మీరు మీ ప్రాధాన్యతలను తిరిగి క్రమపరచాలని ఆశిస్తున్నారా? మీరు ఇతరులను ఎలా చేరుకోవాలో మీకు చూపించమని మరియు అవసరతలో ఉన్న వారికి ఆయన వెలుగును మరియు ప్రేమను పంచునట్లు సహాయపడమని ఆయనను అడగండి.


ప్రారంభ ప్రార్థన

ప్రభువా, నీ భారము నా భారమై యుండవలెనని ఆశిస్తున్నాను. నా ప్రాధాన్యతలను ఎలా తిరిగి సరి చేసుకోవాలో నాకు చూపించుము మరియు మీరు ఆశించిన మార్గములో ఎలా ఇతరులను చేరుకోవాలో నాకు తెలుపుము.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon