ఇతరుల కొరకు ప్రార్ధించుట కష్టమైనప్పుడు

ఇతరుల కొరకు ప్రార్ధించుట కష్టమైనప్పుడు

మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించు (మిమ్మును నిందించి, దుర్వినియోగపరచు మరియు బాధపరచు) వారికొరకు ప్రార్థనచేయుడి.  —లూకా 6:28

ఎవరైనా మీ భావనలను గాయపరచినట్లైతే మీరెలా స్పందిస్తారు? అది మీ ఆనందమును దొంగిలించునట్లు అనుమతిస్తారా? లేక మీ ఉద్రేకములు క్రురముగా వెళ్ళుటకు అనుమతిస్తారా?

లూకా 6:28 మనము గాయపరచబడినప్పుడు మనమెలా స్పందించాలో తెలియజేస్తుంది: మనము వారి కొరకు ప్రార్ధించాలి మరియు వారిని మనము ఆశీర్వదించాలి.

మిమ్మల్ని శపించిన వారి సంతోషము కొరకు ప్రార్ధించుట అనునది సహజ సిద్ధమైన స్పందన కాదు. కానీ దేవుని జ్ఞానము మన జ్ఞానము కంటే ఉన్నతమైనది, కాబట్టి అది సరియైనదని భావించక పోయినప్పటికీ దీనిని చేయుట సరియైనదే.  నేను దీనిని విధేయతతో చేయుటకు ఇష్టపడుతూ ఇలా చెప్తాను, “ప్రభువా, నన్ను గాయపరచిన వారిని ఆశీర్వదించుటకు నేను నిజముగా అంగీకారముగా లేను కానీ నేను విశ్వాసముతో దీనిని చేయాలని ఆశిస్తున్నాను, ఎందుకనగా, మీ సన్నిధితో ఆశీర్వదించమని మీరు నాకు చెప్పియున్నారు”.

దేవుడు మిమ్మల్ని చేయమని చెప్పిన వాటి కొరకు ప్రార్ధించుట చాల కష్టమైన పనులలో ఒకటి, ప్రత్యేకముగా ఒకవేళ మనల్ని ఎవరైనా గాయపరచుట తప్పు అని వారు క్షమించుటకు అర్హులు కారని ఆలోచించినట్లైతే ఇది చాలా కష్టము.

కానీ మనము క్షమాపణను అభ్యాసం చేయాలనీ దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు.  మనము క్షమాపణ మార్గమును అనుసరించుటకు ఎన్నుకున్నప్పుడు, దేవుని వాక్యమునకు విధేయత చూపుట ద్వారా మనము సమాధానము మరియు ఆనందమును అనుభవిస్తాము.  మనము దేవునికి విధేయత చుపుచుండగా, మనము అపరాధమనే బాధను అధిగమించి జీవితాన్ని మరింతగా ఆనందిస్తాము.


ప్రారంభ ప్రార్థన

దేవా, ఇది చాల కష్టమే, కానీ నన్ను బాధపెట్టిన వారి కొరకు ప్రార్ధించి, వారిని దీవించమని నేను వేడుకొనుచున్నాను. గాయమునుండి విడిపించబడుటకు మరియు వారిని క్షమించుటకు నాకు సహయం చేయుము.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon