మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును. —మత్తయి 7:1
అనుదినము మనము ఎదుర్కొనే వేల కొలది సంఘటనలు అవి సరియైనవైనా లేక తప్పు అయినా అవి కేవలం మన – వ్యక్తిగత ఎంపికలే – ఆ ఎంపికలో ఆ విషయాలను లోతుగా తెలుసుకోకుండా వారి స్వంతగా తీసుకునే హక్కును కలిగి యున్నారు.
సాతాను చాలా పని ఒత్తిడితో ఉన్న దయ్యాలకు తీర్పు తీర్చే, క్లిష్టమైన ఆలోచనలను ప్రజల హృదయాలలో నాటును. నాకు ఒక పార్క్ లో కుర్చోనుట లేక మార్కెట్ కు వెళ్ళుట లేక అటు ఇటు తిరుగుతున్న ప్రజలను చూస్తూ – వారిలో ప్రతి ఒక్కరిని గురించి – వారి దుస్తులు, హెయిర్ స్టైల్, స్నేహితులను గమనించుట నాకు గుర్తు ఉన్నది.
కానీ బైబిల్ చెప్తున్నా దేమనగా, ఈ విధంగా ప్రజలను తీర్పు తీర్చుట తప్పు. మనము ఎల్లప్పుడు ఇటువంటి ఆలోచనల నుండి మనల్ని మనము తప్పించలేము మరియు దానిలో తప్పేమీ లేదు కానీ ఇతరులలో తప్పును గుర్తిస్తాము ఎందుకంటే వారు మన వ్యక్తిగత విషయాలను వారు పంచుకోరు కాబట్టి ఇతరులకు తీర్పు తీర్చుటలో మనకు సమస్య కలదు. ఇటువంటి పరిస్థితులలో, నాతో నేను జాయిస్, ఇది నీ పని కాదు అని చెప్తాను.
హానికరమైన తీర్పులు మీలో ఎదగనివ్వకండి. బదులుగా, దేవుడు ప్రతి ఒక్కరినీ ఒక్కొక్క విధముగా సృష్టించాడని మరియు ప్రజలు విభిన్నముగా అలోచించుటలో తప్పులేదని గుర్తించండి. మరియు అవసరమైనప్పుడు, మీతో మీరు ఇది నా పని కాదు అని చెప్పండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను ఇతరులను తీర్పు తీర్చుట కాని లేక విమర్శించుట కాని చేయుట నాకిష్టం లేదు. నేను విభిన్నమైన ఆలోచనలు గల ప్రజలను ఎదుర్కొన్నప్పుడు మరియు వారు నా కంటే భిన్నముగా ఉన్నప్పుడు వారిని మీ కన్నుల ద్వారా చూచుటకు సహాయం చేయండి మరియు నా ఆలోచలను ఇతరుల ఆలోచనల కంటే ప్రాముఖ్యమైనవి కావని జ్ఞాపకం ఉంచుకుంటాను.