ఈ మార్గములో ఇది ఉత్తమమైనది

ఈ మార్గములో ఇది ఉత్తమమైనది

అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుట వలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్ళిన యెడల ఆయనను మీయొద్దకు పంపుదును. (యోహాను 16:7)

మన జీవితాల్లో పరిశుద్ధాత్మ సన్నిధి మనం ఊహించలేనంత అద్భుతమైనది. ఆయన మన ఆదరణకర్త అంటే మనం జీవితంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు ఎప్పుడైనా బాధ కలిగినా ఆయన మనకు సహాయం చేస్తాడు మరియు ఓదార్చాడు. నా తదుపరి శ్వాస వలె పరిశుద్ధాత్మ నాకు దగ్గరగా ఉన్నట్లు నేను ఆలోచించాలనుకుంటున్నాను.

పరిశుద్ధాత్మ మన జీవితాల కొరకు దేవుని ప్రణాళికలోకి నడిపిస్తాడు మరియు మార్గదర్శిగా ఉంటాడు. ఆయన నాయకత్వాన్ని అనుసరించడం నేర్చుకోవడం ఖచ్చితంగా ఒక ప్రయాణం. మనం మన స్వంత ఆలోచనలు, భావాలు మరియు కోరికల ప్రకారం జీవించడం అలవాటు చేసుకున్నాము, అయితే క్రైస్తవులుగా మనం పరిశుద్ధాత్మచే నడిపించబడటం నేర్చుకోవాలి. యేసు ఒక మనిషి శరీరంలోకి వచ్చాడు మరియు జీవితంలో మనం అనుభవించే ప్రతిదాన్ని అర్థం చేసుకున్నాడు. యేసు నన్ను అర్థం చేసుకున్నాడని గుర్తుంచుకోవడం నాకు చాలా ఓదార్పునిస్తుంది! ఆయన ఓపికగా ఉంటాడు మరియు మనం నేర్చుకోవడం కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నంత కాలం మనతో కలిసి పని చేస్తూనే ఉంటాడు.

తాను వెళ్లి పరిశుద్ధాత్మను పంపితే మంచిదని యేసు ఎందుకు చెప్పాడు? భూమిపై యేసు ప్రత్యక్షంగా ఉండడం కంటే మెరుగైనది ఏది? యేసు ఒక సమయంలో ఒక ప్రదేశంలో మాత్రమే ఉండవచ్చు, కానీ పరిశుద్ధాత్మ ప్రతిచోటా ఉంటటాడు అందరిలో ఒకే సమయంలో పని చేస్తాడు. ఇది అద్భుతంగా ఉంది!
ఒక్క క్షణం కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆయనకు మన గురించి ప్రతిదీ తెలుసు మరియు మనలో విరిగిన లేదా గాయపడిన వాటన్నింటినీ నయం చేయడానికి మరియు ప్రతిదీ దాని సరైన పని క్రమంలో ఉంచడానికి పని చేస్తున్నాడు. ప్రతిరోజు మనం పరిశుద్ధాత్మ యొక్క అద్భుతమైన శక్తి మరియు జ్ఞానం ద్వారా అన్ని విధాలుగా మెరుగుపడతాము.


ఈరోజు మీ కొరకు దేవుని మాట: మీరు ఉన్నపాటూనే మిమ్మల్ని అంగీకరించమని మరియు మీరెలా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడో అలాగే చేయమని పరిశుద్ధాత్ముని అడగండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon