ఉత్తమ ఆలోచనలను ఎన్నుకొనండి మరియు ఉత్తమ జీవితమును కలిగి యుండండి

ఉత్తమ ఆలోచనలను ఎన్నుకొనండి మరియు ఉత్తమ జీవితమును కలిగి యుండండి

జీవమరణములు నాలుక వశము దానియందు ప్రీతిపడువారు దాని (జీవము లేక మరణమనే) ఫలము తిందురు. —సామెతలు 18:21

జీవ మరణములు నాలుక వశమని లేఖనములు స్పష్టముగా తెలియజేయుచున్నవి. మనము మన నోటిని నిగ్రహపరచుట నేర్చుకొనుట చాల ప్రముఖ్యమైనది, కానీ మనము దానిని సరియైన విధానములో చేయుటకు మనము సిద్ధపడవలెను.

కొంత మంది వారి నాలుకను నియంత్రించుటకు ప్రయత్నిస్తారు కానీ వారి ఆలోచనలను మాత్రము ఏమి చేయలేరు. ఇది కలుపు (గడ్డి) పైభాగాన్ని లాగడం లాంటిది, మూలాన్ని తవ్వకపోతే, కలుపు ఎల్లప్పుడూ తిరిగి వస్తుంది. మీరు మొదట మీ మనస్సును నియంత్రించడం నేర్చుకోకపోతే మీరు మీ నోటిని నియంత్రించరు.

మనము తరచుగా తప్పు ఆలోచనలను గురించి ఆలోచించుటకు మనము శోధించబడతాము కానీ మనము వాటిని అంగీకరించవలసిన అవసరం లేదు. మనకు ఒక ఎంపిక కలదు! మనము ఉద్దేశ్య పూర్వకముగా సరియైన విధముగా ఆలోచిస్తాము కాబట్టి సరియైన మాటలే పలుకుతాము.

మీరు దేవునిని మరియు దేవుని వాక్యమును గురించి వినుట ఆలోచించుట మరియు మాట్లాడుట ద్వారా జీవమునిచ్చే  ఆలోచనలను ఎన్నుకోగలరు. మీలోపల ఏదైతే ఉంటుందో అదే బహిర్గత మవుతుంది, కాబట్టి మీరు మీ మనస్సును దేవుని నుండి వచ్చే మేలుకరమైన, అనుకూలమైన, శక్తివంతమైన ఆలోచనలతో నింపితే జీవము నిచ్చే మాటలు సహజముగా బహిర్గతమవుతాయి.

ప్రారంభ ప్రార్థన

పరిశుద్ధత్మా, నేను నా ఆలోచనలను మార్చుకోవాలని ఆశిస్తున్నాను కాబట్టి నేను జీవమునిచ్చే మాటలనే మాట్లాడతాను. మీ వాక్యముతో నా మనస్సును నూతనపరచుటకు సహాయం చేయండి తద్వారా నా మాటలు మిమ్మును ప్రతిబింభింపచేస్తాయి. 

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon