
సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్య వలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. —2 కొరింథీ 9:7
క్రైస్తావులముగా మనము ఇవ్వగలిగిన దానిని ఇస్తూ ఉదారముగా ఉండాలి. దాని అర్ధం కేవలం డబ్బు మాత్రమే కాదు కానీ – మనము సహాయము, ప్రోత్సాహము, తలాంతులు మరియు క్షమాపణ.
దీని అర్ధము మన మార్గములో స్వార్ధము రాకుండా చేయుటయని కాదు. చాలా మంది ప్రజలు స్వార్ధముగా ఉండుట మరియు వారు కలిగియున్న దానిని అంటిపెట్టుకొని దానిని ఇతరులకు ఇచ్చుటకు భయపడుతూ ఉంటారు. ఇతరులు వారి క్రియల్లో ఉద్రేకమును కలిగి యుండరు, కానీ వారి హృదయాల్లో వారికి ఇవ్వాలని లేకపోయినా ఇవ్వాలి కాబట్టి ఉద్రేకాన్ని చూపిస్తారు.
కానీ దేవుడు ఇచ్చుటకు మనల్ని పిలిచినా విధానం ఇది కాదు. 2 కొరింథీ 9:7 లో సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించునని చెప్తుంది.
నీవు దానిని గురించి ఆలోచిస్తున్నట్లైతే, మనము మన జీవితాలను దేవునికిచ్చినప్పుడు – సమస్తము ఆయనకు చెందినవే కానీ – మనకెంత మాత్రమూ చెందదు. మనకు ఇవ్వబడిన వనరులను మనమెలా వాడాలని దేవుడు చెప్పాడో వాటిని ఉపయోగిస్తూ మనము ఇచ్చేవారముగా ఉండాలి.
ఈరోజే ఆనందముగా ఇవ్వండి. అది దేవునిని సంతోష పెడుతుంది మరియు ఉత్సాహముగా ఇచ్చేవారు ఆనందముగా, నేరవేర్చబడు వారుగా మరియు అధిక ఫలవంతముగా ఉంటారు.
ప్రారంభ ప్రార్థన
దేవా, ఉత్సాహముగా ఇచ్చవానిగా నేను నా మనస్సును మరియు హృదయపు ఉద్దేశ్యమును సరి చేసుకుంటాను. నీకు మరియు ఈరోజు నా జీవితములోని ప్రజలకు ఉదారముగా ఎలా ఇవ్వాలో నాకు చూపించండి.