… తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చిత్తమైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను: —లూకా 22:43
పరిశుద్ధాత్మను అనుసరిస్తూ పరిపక్వత గల క్రైస్తవుడుగా ఎదుగుట అనునది ఒక్క రాత్రిలో జరిగేది కాదు – అది నేర్చుకునే ప్రక్రియ కనుక సమయం పడుతుంది, ఒకదాని తరువాత మరియొకటి, ఎదుగుటకు దేవుడు అవకాశములను అనుగ్రహిస్తూ మన ఉద్రేకములను శోధిస్తూ పరీక్షిస్తూ ఉంటాడు.
దేవుడు మనలను కష్ట పరిస్థితులలో గుండా తీసుకెళ్తూ మన ఉద్రేకములను కదిలిస్తాడు. ఈ మార్గంలో, ఈ విధంగా, మీరు మరియు నేను ఎంత మానసికంగా అస్థిరంగా ఉంటున్నామో మరియు ఎంత తీవ్రంగా ఆయన మనకు సహాయం అవసరమో మనము చూడగలుగుతాము.
యేసు దీనిని మన కొరకు ఉదాహరించాడు. ఆయన మన పాపముల కొరకు మరణించుటకు ముందు రాత్రి ఆయన చాలా వేదనతో నిండియున్నాడు. ఆయన మరణించాలని ఆశించలేదు, కానీ తన ఉద్రేకములతో కదిలించబడి దేవునికి ప్రార్ధన చేసియున్నాడు, “నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక!” ఈ విషయాలు ఏ మాత్రమూ మెరుగైనవి కావు, ముగింపులో సాధ్యమైన అతి గొప్ప శోధనలో యేసు విజయాన్ని పొందాడు.
మీరు దీనిని మీ ఉద్రేకపరమైన శోధనల ద్వారా చేయవచ్చును. యేసు తన భావనల ద్వారా నడిపించ బడలేదు మరియు ఆ విధముగా ఉండవలసిన అవసరం లేదు. పరిస్థితులు ఉద్రేకపరముగా ప్రభావితము చూపినట్లైతే, ఆ క్షణమును పట్టుకొని దేవునిలో సంపూర్ణ నమ్మకము కలిగియుండు స్థలములో అడుగిడే అవకాశముగా చూడుము.
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, ఉద్రేకపరమైన శోధనలు నా మార్గములో వచ్చినప్పుడు నేను నీ యందు నమ్మిక యుంచగలనని నేనెరుగుదును. యేసును ఉదాహరణగా చేసుకొని, “నా ఇష్టము కాదు నీ చిత్తమే జరుగును గాక” అని చెప్పుదును. నాకేది ఉత్తమమో నీకు తెలుసు మరియు నేను నీ యందు పూర్తిగా విశ్వాసముంచు చున్నాను.