
… “వెంటనే ఆ చిన్నవాని తండ్రినమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమని బిగ్గరగా చెప్పెను!” —మార్కు 9:24
మీరెప్పుడైనా దు:ఖములో నిండిపోయి ఈ పరిస్థితి నాకెందుకు సంభవించింది అని మిమ్ములను మీరు ప్రశ్నించుకొనిన సంఘటనలు ఉన్నాయా?
ఒక్క నిమిషము, దేవుడు ఈ ప్రశ్నకు నిజముగా జవాబిచ్చునట్లు ఊహించుకుందాము. ఆయన వివరణ దేనినైనా మారుస్తుందా? ఈ విషాదం యొక్క ప్రభావాలు ఇప్పటికీ మీతోనే ఉండిపోతాయి మరియు ఇది ముందు ఉన్నంతకంటే నొప్పి తీవ్రంగా ఉంటుంది. మీరు ఏమి నేర్చుకోవాలి?
మేము ఆ ప్రశ్నను దేవుణ్ణి అడిగినప్పుడు, మనం నిజంగా దీనిని అడుగుతున్నాము అని నేను అనుకుంటాను: “దేవా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నా చింత మరియు దుఖ:ములో నీవు నన్ను పట్టించుకుంటావా? దేవుడు నా గురించి నిజముగా పట్టించుకోడేమో అని భయపడుతూ మనము వివరణ కోసము అడుగుతున్నమా?
దానికి బదులుగా, మనము ఇలా పలుకుటకు నేర్చుకొనవలెను: “ప్రభువా, నేను నమ్ముతున్నాను. నాకు అర్థం కాలేదు మరియు చెడు విషయాలు జరిగేటప్పుడు అన్ని కారణాలనూ నేను గ్రహిస్తాను, కాని మీరు నన్ను ప్రేమిస్తున్నారని మరియు నాతో ఎల్లప్పుడూ ఉంటారని నాకు తెలుసు”.
దాని నుండి విడుదల పొందుట కంటే దాని ద్వారా విజయవంతముగా వచ్చునట్లు ఎక్కువ విశ్వాసము అవసరమని నేను నమ్ముతున్నాను. నీవు దేవుని యందు విశ్వసముంచుము మరియు మరియొక వైపు నుండి మీరు బలవంతులుగా రాగలరు.
ప్రారంభ ప్రార్థన
తండ్రియైన దేవా, చింతించుట అనునది ఒక పాపము అని నాకు చూపించినందుకు మీకు నా వందనములు. నా స్వార్ధము, దైవికము కానీ కోరికలనుండి బయటపడుటకు నాకు సహాయం చేయండి తద్వారా నేను నా గమ్యమును సులభమును చేరుకోగలను.