
యెడతెగక ప్రార్థనచేయుడి. (1 థేస్సలోనీకయులకు 5:17)
మనం ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రార్థించవచ్చు. మనకు ఇవ్వబడిన సూచనలేమిటంటే, “ఎల్లప్పుడూ, ప్రతి సందర్భంలోనూ, ప్రతి సీజన్లోనూ ప్రార్థించండి” మరియు “ప్రార్థనలో ఎడతెగని ప్రార్ధన” చేయాలి, అయితే మనం రోజంతా ఒక మూలలో దేవుని మాట వినడం ద్వారా గడపలేమని మనకు తెలుసు. అలా చేస్తే మన జీవితాన్ని జీవించలేము. ప్రార్థన అనేది శ్వాస వంటిదిగా ఉండాలి-క్రమబద్ధంగా, తేలికగా ఉండాలి-మరియు మనం జీవించే విధానంలో భాగంగా మన జీవితంలో మనం ప్రార్థన చేయాలి. నిజానికి, మన భౌతిక జీవితాలు శ్వాస ద్వారా నిలకడగా ఉన్నట్లే, మన ఆధ్యాత్మిక జీవితాలు ప్రార్థన ద్వారా నిర్వహించబడాలి. మనం బిగ్గరగా ప్రార్థించవచ్చు లేదా మౌనంగా ప్రార్థించవచ్చు. మనం కూర్చొని, లేచి నిలబడి లేదా నడిచి ప్రార్థించవచ్చు. మనం కదులుతున్నప్పుడు లేదా నిశ్చలంగా ఉన్నప్పుడు మనం మాట్లాడవచ్చు మరియు దేవుని మాట వినవచ్చు. మనం షాపింగ్ చేస్తున్నప్పుడు, అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నప్పుడు, బిజినెస్ మీటింగ్లో పాల్గొంటున్నప్పుడు, ఇంటి పనులు చేస్తున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా స్నానం చేస్తున్నప్పుడు ప్రార్థన చేయవచ్చు. “ప్రభువా, నీవు చేస్తున్న ప్రతి కార్యమును బట్టి ధన్యవాదాలు” లేదా “దేవా, నాకు మీరు సహాయం చేయాలి” లేదా “ఓహ్, యేసయ్యా, అక్కడ చాలా విచారంగా ఉన్న స్త్రీకి సహాయం చేయి” వంటి వాటిని మనం ప్రార్థించవచ్చు. వాస్తవానికి, ప్రార్థనకు ఈ విధానం దేవుని చిత్తం. మనం ప్రార్థన చేయడం మరచిపోతామని ఆశిస్తూ, మనం వాయిదా వేయాలని సాతాను కోరుకుంటున్నాడు. మీ హృదయానికి ఏదైనా తలంపు వచ్చినప్పుడు వెంటనే ప్రార్థించమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఇది రోజంతా దేవునికి సమీపముగా ఉండటానికి మీకు సహాయం చేస్తుంది.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: దేవునితో స్థిరమైన సంభాషణను కలిగి యుండండి.