కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. —హెబ్రీ 10:24
నాకు ముగ్గురు స్నేహితులున్నారు వారితో నేను మధ్యాహ్న భోజనమునకు లేక కాఫీ కి వెళ్తాను. మేము కొన్నిసార్లు ఇతరులకు ఆశీర్వదముగా ఉండునట్లు తాజా మార్గములకు అవసరమైన సృజనాత్మక ఆలోచనలను దేవుడు మా హృదయములపై ఉంచిన వాటిని గురించి మాట్లాడుకుంటాము. ఇటువంటి చర్చలు దేవునికి చాలా ప్రీతికరముగా ఉంటాయని మేము నమ్ముతాము.
ఇతరులను ప్రోత్సహించుటలో మంచి పనులను చేయుటకు చేయాలనే ఆలోచనలు ముందుండుట అనునది క్రొత్త కాదు. హెబ్రీ 10:14 ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురికొల్పవలెనని చెప్తుంది. సత్కార్యములు చేయుటకు, ప్రేమ చూపుటకు మరియు సహాయకరమైన పనులు చేయుటకు ఒకరినొకరు పురికొల్పుటలో మనము వాస్తవముగా అధ్యాయనం చేసి ఆలోచించ వలెను.
నాకు నేనుగా దేవునిని అనుసరించుట శక్తివంతమైనది, కాని దీనిని చేయుట ద్వారా స్నేహితులతో కలిసి ఎంతో ఆనందించ గలమని నేను కనుగొన్నాను. దేవునిని అనుసరించాలనే ఒకే మనస్సు గల వారిని కనుగొనమని నేను సవాలు చేస్తున్నాను. క్రైస్తవ జీవితమును జీవించుటకు అనుభవపూర్వక మార్గములను గురించి ఊరటపడే ఒక కూడికను గురించి ఆలోచించండి. దేవునిని సేవిస్తూ ఆయన ప్రేమతో కలిసి జీవించే మార్గములను వెదకండి.
ప్రారంభ ప్రార్థన
పరిశుద్దాత్మా, మిమ్ములను ఎక్కువగా అనుసరించుటకు నాకు సహాయపడే సరియైన స్నేహితులను నాతో అనుసంధానము చేయండి. నేను ఇతరులతో కలిసి క్రైస్తవ జీవితమును జీవించుచు దేవుని ప్రేమతో జీవించునట్లు ఒకరినొకరము పురికొల్పు కొనునట్లు సహాయ పడండి.