సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను (ఇది నా ఆశయై యున్నది); వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు… —ఫిలిప్పి 3:13
ఒకవేళ … ఏమవుతుంది?
ఒక వ్యక్తి ఎంత సుదీర్ఘ కాలము జీవిస్తే వారు ఒకవేళ…. ఏమవుతుంది? అనే ఆలోచనలో పడతారు మరియు అది తరచుగా విచారము లేక దు:ఖమునకు దారితీస్తుంది. ఒక శుభవార్త ఏదనగా యేసు యొక్క ఒక అనుచరుడికి ఒకవేళ … ఏమవుతుంది? అనే దానిని గురించి చింతించవలసిన అవసరం లేదు కానీ దేవుడు వారి కొరకు కలిగియున్న భవిష్యత్తును చూచుటయే ఎంతో ఉత్సాహకరమైన సవాలు.
ఒక సంఘము వారు వారి సంఘ కాపరి ద్వారా రాబోయే సంవత్సరములో నాలుగు సామాన్య విషయములలో (ఒక్క నెలలోనే) తమను తాము సమర్పించుకొనవలెనని సవాలు చేయబడ్డారు. ఆయన వారిని ప్రతిరోజూ ప్రార్ధించమని, వారములో ఒక్కరోజు ఉపవాసముండమని, దశమ భాగము ఇవ్వమని మరియు వారమునకు రక్షణ లేని ఒక వ్యక్తిని సంఘమునకు నడిపించవలెనని చెప్పాడు.
ఫలితముగా సంఘములో ఉహించని మార్పు జరిగింది. ఆ సంఘ ఆరాధనలలో బలమైన దేవుని సన్నిధి దిగి వచ్చినది. పరిచర్య ప్రాజెక్టుల్లో మరియు భవనాల నిర్మాణముల ప్రతిపాదనలో ఆర్ధికపరమైన గొప్ప మార్పులు సంభవించాయి. అన్నింటికంటే ఉత్సాహముతో కూడిన విషయమేదనగా సంఘ సభ్యులు దేవుని రాజ్యములోనికి తప్పిపోయిన ఆత్మలను నడిపించుటలో ఒక అసాధారణ జీవితములోనికి నడిపించబడ్డారు.
నేను మీకు సవాలు చేస్తున్నాను: ఒకవేళ మీరు ఆ సంఘము వలెనే దేవుని కొరకు పని చేసినట్లైతే ఏమి జరుగుతుంది? ఒకవేళ మీ జీవితమును పూర్తిగా మీరు దేవునికి అప్పగించుకున్నట్లైతే ఏమి జరుగుతుంది? దేవుడు ఏదైతే చేయగలడో దానిని చేయుటకు మీరు ముందడుగు తీసుకున్నట్లయితే ఏమి జరుగుతుంది? ఏమి జరుగవచ్చును?
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, ఒకవేళ….ఏమవుతుంది? అని అడుగుటతో నా జీవితాన్ని గడపాలని నేను ఆశించుట లేదు. ఈరోజు నేను మిమ్మును పొందుకొనుటకు నేను ఒక తాజా సమర్పణ తీసుకున్నట్లయితే మీరు నా జీవితములో చేసే అద్భుతమైన విషయములను చూచుటకు ఎంతో ఉల్లాసముగా ఉన్నాను.