
నీ భారము యెహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు (తొట్రిల్ల నీయడు, పడనీయడు లేక విఫలమవ్వనీయడు). —కీర్తనలు 55:22
దేవుడు మీతో కలిసి వ్యాపారము చేయాలనీ ఆశిస్తున్నాడని మీకు తెలుసా? ఆయన మీ భారములు, సమస్యలు మరియు పతనములన్నియు ఆయన మీద వేయమని చెప్తున్నాడు. దీనికి బదులుగా, ఆయన తన సమాధానమును ఆనందమును మీకు అనుగ్రహించాలని ఆశిస్తున్నాడు.
దేవుడు నిజముగా మనలను గురించి శ్రద్ధ తీసుకోవాలని ఆశిస్తున్నాడు, కానీ ఆయనను అనుమతించాలంటే, మన గురించి మనము శ్రద్ధ తీసుకొనుట మరియు మనము నిగ్రహించలేని ప్రతి చింతను గురించి చింతించడం ఆపాలని ఆశిస్తున్నాడు. అనేక మంది ప్రజలు వారిని గురించి దేవుడు శ్రద్ధ వహించాలని ఆశిస్తారు కానీ వారు దేవుడిచ్చే ఆలోచన కొరకు వేచి యుండకుండా వారి స్వంతగా వారే తమ సమస్యల గురించి చింతిస్తూ వాటికి జవాబులు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు.
దేవుడు మనకు శాంతిని అనుగ్రహిస్తాడు, కానీ మొదటిగా మనము మన చింతలను దేవునికివ్వాలి! మనము మన చింతలను దేవునికిస్తే అయన తన శాంతిని మనకు అనుగ్రహించును. మనము మన చింతలన్నిటినీ మరియు భారములన్నిటిని దేవునికిస్తాము మరియు ఆయన తన భద్రతను, స్థిరత్వమును మరియు ఆనందమును మనకు అనుగ్రహించును. ఆ అద్భుతమైన ఆశీర్వదమును మరియు ఆయన ద్వారా శ్రద్ధను పొందుకునే ఆధిక్యతను మనకు అనుగ్రహించును.
ప్రార్ధనా స్టార్టర్
ప్రభువా, మీరు నాకు ఒక అద్భుతమైన పనిని అప్పగించి యున్నారు. మీరు నా కంటే ఎంతో గొప్ప సామర్ధ్యము గల వారు, కాబట్టి నా భారములన్ని మీ మీద మోపుచున్నాను మరియు మీరు నాకొరకు సిద్ధపరచిన సమాధానమును మరియు ఆనందమును పొందుకొనుచున్నాను!