నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియకయుండవలెను. … —మత్తయి 6:3
హతసాక్షి అనగా ఏమిటో మనందరికీ తెలుసు. క్రీస్తు కొరకు మరణించిన యోధులైన స్త్రీ, పురుషుల హృదయపూర్వక గాధలను మనము విని యున్నాము. కానీ ధైర్యములేని మరియు ప్రసిద్ధి చెందని మరియు నిరంతము బాధపడేవాడు అంతేకాక వినే వారితో తమ బాధలను పంచుకొనుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఈ హతసాక్షులు చేసే త్యాగాన్ని అందరూ తెలుసుకోవాలని ఆశిస్తారు.
“హతసాక్షి వల” అనునది సులభముగా పడుటకు వీలుగా ఉంటుంది. మన కుటుంబములు మరియు మన స్నేహితులకు సేవ చేయుట ప్రారంభిస్తాము మరియు వారిని ప్రేమిస్తాము. కానీ కొంతకాలము తరువాత, మన మనస్సులు మారటం ప్రారంభించి వారి నుండి ఎదో ఒకటి తిరిగి రావాలని కోరుకుంటాము. చివరకు మన సేవక హృదయాన్ని కోల్పోతాము. మన వైఖరి మారుతుంది, మరియు మనము మన గురించి జాలి పడటటం ప్రారంభిస్తాము. అప్పుడు మనము హతసాక్షులుగా మారతాము.
బైబిల్ చెప్తున్నదేమనగా మన కుడి చేసే దానిని ఎడమ చేతికి తెలియకుండా చేయాలి. మరో మాటలో చెప్పాలంటే, ప్రజలు మనలను గుర్తించినా గుర్తించక పోయినా సేవ చేయాలనీ.
మీరు “హతసాక్షి వల”లో పడ్డారా? అలా పడిన యెడల మీరు గుర్తింపు లేకుండా భారము కలిగి స్వార్ధము లేకుండా ఆపని చేయుటకు ఆయన హృదయము మీకిచ్చునట్లు అడగండి.
ప్రారంభ ప్రార్థన
పరిశుద్దత్మా, ఒకవేళ నేను హతసాక్షి వలలో పడియుంటే నాకు చూపుము. నేను సేవ చేయుటకు నీ ఆత్మను కలిగి యుండుటకు నాకు సహాయం చేయుము తద్వారా నేను నిస్వార్ధముగా మరియు ఆనందముతో మీరు ఆశించిన విధముగా ఇతరులకు సేవ చేసే హృదయమును నేను కలిగి యుండాలని ఆశిస్తున్నాడు.