మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై, (ఒక తాజా మానసిక మరియు ఆత్మీయ వైఖరిని కలిగిన వారై) – ఎఫెసీ 4:23
నూతన అరంభాములను కలిగియున్న ప్రజల అనుభవాలతో నిండిన కథలతో బైబిల్ నింపబడి యున్నది. మోషే నలభై సంవత్సరములు గొర్రెల కాపరిగా ఉండిన తరువాత నాయకుడుగా మారియున్నాడు. దేవుడు పౌలును నుతన పరచునంత వరకు మరియు గొప్ప అపోస్తలులలో ఒకరుగా చేయునంత వరకు క్రీస్తును ద్వేషించి యున్నాడు.
మనము యేసును మన స్వంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు అది చివరి నూతన ప్రారంభమై యున్నది. ఒక నూతన మార్గములో జీవించుట నేర్చుకొనుటకు ఒక అవకాశము కలిగిన నూతన సృష్టియై యున్నాము. కానీ ఆ నూతన జీవితమును అనుభవించుటకు అవసరమైన మొదటి మెట్టు మీకు అందుబాటులో ఉందని నమ్ముటయే.
ఎఫెసీ 4:23 చెప్పునదేమనగా మనము మన మనస్సులు మరియు వైఖరులలో స్థిరముగా నూతనపరచ బడుతూ ఉండాలి. బైబిల్ లోని గొప్ప వ్యక్తులను గురించి చదువుట చాలా తేలిక మరియు మీరు వారిలాంటి వారు కాదు కానీ దానిని గురించి ఆలోచించుట ప్రారంభించినప్పుడు మీరు మీ మనస్సును అక్కడే నూతనపరచు కొనవచ్చును.
మీరెలా భావిస్తారనే విషయంలో కాక – దేవుడు వాక్యమువలె ఆలోచించుట ఎంపిక చేసుకోండి. ఆయన ప్రేమను పొందుకొని నూతన ఆరంభమును అనుభవించండి. దేవుడు నన్ను అంతరంగములో నుండి బయటకు పూర్తిగా మార్చుచున్నాడనే వైఖరితో మీరు జీవించుచున్నట్లైతే జీవితం చాలా మధురముగా ఉంటుంది. ఆయన నూతన ఆరంభమును ఇస్తున్నాడు మరియు గొప్ప విషయాలు ముందున్నాయి.
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, నేను మీ వాక్యముతో నా మనస్సును నూతన పరచుకోవాలని ఆశిస్తున్నాను. నా కొరకు మీరు ఒక నూతన ఆరంభమును కలిగి యున్నారని మరియు మీరు మోషే, పౌలును పిలిచినట్లు నన్ను పిలుస్తున్నారని నాకు తెలుసు. మీరు దానిని నెరవేరుస్తారని నమ్ముతూ నేను దానిని ఈరోజే పొందుకుంటున్నాను.