కఠినమైన నిర్ణయాలు తీసుకొనుట

కఠినమైన నిర్ణయాలు తీసుకొనుట

మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. —హెబ్రీ 4:15

సరియైన నిర్ణయాలు తీసుకొనుట చాలా కఠినమైనది కాబట్టి – గాయపడినప్పుడు, నిరుత్సాహము, నిస్పృహ మరియు కలవరముల మధ్యలో సరియైన నిర్ణయాలు తీసుకొనుట చాల ప్రాముఖ్యమైనది. పరిస్థితులు ఒత్తిడితో నిండి యున్నప్పుడు, మనము స్వాభావికముగా మనము అతి తక్కువ నిరోధకత ఉన్న మార్గమును ఎన్నుకొనుటకు ఇష్ట పడతాము. కానీ అత్యున్నత తేడాను కలిగించుటకు సరియైన నిర్ణయములు తీసుకునే సమయాలు కూడా ఉన్నాయి.  సరియైన ఫలితములు పొందుకొనుటకు మీకు ఇష్టం లేకపోయినా మీరు సరియైన దానినే చేయాలి.

నన్ను ఆశ్చర్యపరచేది ఏదనగా మన భావనలన్నియు యేసుకు తెలుసు. ఆయన మానవుడుగా ఉన్నప్పుడు మనము భరించిన కష్టాలన్నియు ఆయన భరించి యున్నాడు. మనము దానిని వదిలిపెట్టి సులభ మార్గమును ఎన్నుకోవాలని భావించాము కానీ ఆయన దానిని జయించాడు మరియు కఠిన ఎంపికలు చేసి యున్నాడు.

మనము నిర్ణయాలు తీసుకునేటప్పుడు పొరపాటులు చేసియున్నట్లైతే, మనము దేని గుండా వెళ్తున్నామో దానిని గురించి సమస్తమును ఎరిగియున్న దేవునిని మనము సేవిస్తున్నామని నమ్మగలము. ఆయన మనకు సహాయపడాలని మరియు ఆయన కృపను ఇవ్వాలని ఆశిస్తున్నాడు తద్వారా, మనము మన స్వంతగా కఠిన నిర్ణయములు తీసుకోవలసిన అవసరం లేదు.

మనము మనలను ఒత్తిడిలో ఉన్నట్లు లేక విడిచిపెట్టే పరిస్థితిలో ఉన్నట్లు చూచిన యెడల దేవుడు మీతో ఉన్నాడని మరియు ఆయన అర్ధం చేసుకుంటాడని జ్ఞాపకం చేసుకోండి. ఆయనలో కఠిన నిర్ణయములు తీసుకొనుటకు బలమును పొందుకోనుము.

ప్రారంభ ప్రార్థన

దేవా, నేను వెళ్తున్న పరిస్థితిని మరియు నేను ఎదుర్కొంటున్న ప్రతి పోరాటమును అర్ధం చేసుకుంటావని నేను కృతజ్ఞత కలిగి సంతోషిస్తున్నాను. నేను అత్యల్ప నిరోధకతయనే మార్గమును తీసుకొనుటకు శోదించబడినప్పుడు, కఠినమైన నిర్ణయాలు తీసుకొనుటకు మీలో నేను నా బలమును కనుగొందును.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon