కలహారంభము నీటిగట్టున (ఆనకట్టలో నుండి ఒక పగులు నుండి ) పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము. – సామెతలు 17:14
క్రైస్తవులకు వ్యతిరేకముగా సాతానుడు వాడే ఆయుధాలలో కలహము ఒకటి. కలహాత్మను రేపుటకు ఈ మూడు విషయాలు పని చేస్తాయని నేను నమ్ముతాను.
- మన నొరు: తప్పుడు సమయంలో తప్పుడు మాటలు మాట్లాడుట ఖచ్చితముగా తుఫానును పుట్టిస్తుంది. అగ్ని మీద మనము ఎక్కువ తప్పుడు మాటలు పోస్తుండగా అది ఇంకను పెద్దదిగా మారుతుంది. అగ్నిని అర్పుటకు ఒక మర్గామేదనగా ఇంధనమును తీసి వేయుట.
- మన గర్వము: తప్పుడు మాటలు కలహమునకు ప్రారంభమైనప్పటికీ, సమాధానము కలిగి యుండుటకు నెమ్మదిగా ఉండవలసి యుండగా గర్వ హృదయము దానిని తృణీకరించును. గర్వము మనము చివరి మాటను కలిగి యున్నామని ఆజ్ఞాపిస్తుంది కానీ ఆ మాట నాశనమునకు దారి తీస్తుంది (సామెతలు 16:18 చూడండి).
- మన ఉద్దేశ్యములు: మన స్వంత ఉద్దేశ్యములతో ఇతరులను ఒప్పించుటకు ప్రయత్నిస్తూ మనము కలహాములో పడతాము. మనము ఎంతో నేర్చుకోవలసియున్నదని మనము గుర్తించినప్పుడు మరియు అవసరత లేనప్పుడు మనము మన ఆలోచనలు చెప్పుట ఆపివేసినప్పుడు మనకు అవసరమైన జ్ఞానమును పొందుకొనుట ప్రారంభిస్తాము.
శత్రువు ఎల్లప్పుడూ మన జీవితమును కలహముతో నింపుటకు పని చేస్తూ ఉంటాడు. సమాధానము, ఐక్యత మరియు అవగాహన చేయుటకు ప్రయత్నించకుండా కలహమును ఎదిరించుటకు దేవునిని మరియు ఇతరులను గౌరవించుటకు ఒక నిర్ణయము తీసుకోండి.
ప్రారంభ ప్రార్థన
పరిశుద్ధత్మా, కలహమునకు వ్యతిరేకముగా జీవించుటకు నాకు సహాయం చేయుము. నా మాటలు మరియు నా ఆలోచనలను మీకు అప్పగించు చున్నాను. నేను ఇతరులతో నా సంబంధాలలో కలహము వీడి నడవాలని నేను ఆశించు చున్నాను.