
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. —రోమా 12:1
2 కొరింథీ 8వ అధ్యాయంలో పౌలు కొరింథీలోని విశ్వాసులతో కానుకలను గురించి మాట్లాడుతూ, ఆయన వారికి మాసిదోనియాలోని సంఘాలను ఉదాహరణగా చెప్పియున్నాడు. ఆయన 5వ వచనములో ఇదియుగాక మొదట ప్రభువునకును, దేవుని చిత్తమువలన మాకును, (వారు తమ ఇష్టాలను పూర్తిగా వదిలి పెట్టి) తమ్మును తామే అప్పగించుకొనిరి; యింతగా చేయుదురని మేమనుకొనలేదని చెప్పి యున్నాడు.
వారు కేవలం వారి డబ్బును ఇవ్వలేదు – కానీ వారు వారినే సమర్పించుకున్నారనే విషయం నన్ను చాల ఆశ్చర్య పరచింది.
మనలో ఎంత మంది తమ పేర్లు వ్రాసి వాటిని కత్తిరించి వారి కానుకల పెట్టెలో అతికిస్తారనే విషయం నాకు ఆశ్చర్యం వేస్తుంది. రోమా 12:1 చెప్పునదేమనగా మనము ఒక త్యాగముగా మనల్ని మనము దేవునికి అర్పించుకోవాలి.
దీని అర్ధమేదనగా సంఘము వెలుపల దేవుని కొరకు జీవించుట. దీని అర్ధం డబ్బు ఇచ్చుటకు సిద్ధపడుట మాత్రమే కాదు కానీ మీ మార్గములో దేవుడు ఉంచిన ఎవరినైనా ప్రేమించుటకు సిద్ధపడుట. దీని అర్ధం దేవుని రాజ్యము కొరకు మీరు కలిగియున్న ప్రతి వనరులను ఉపయోగించుటకు మీరు సిద్ధపడుటయే.
కాబట్టి మీరు తరువాత ఎప్పుడైనా సంఘములో ఉన్నప్పుడు మరియు కానుకల పెట్టె మీ ముందుకు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకొనుటకు సిద్ధంగా ఉండాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను!
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను కలిగియున్న సమస్తమును సమర్పించవలెనని ఆశిస్తున్నాను. నన్ను నేను సజీవ సమర్పణగా అర్పిస్తున్నాను. మీ మహిమ నిమిత్తమును మీరు నాకిచ్చిన వనరులను ఎలా ఉపయోగించాలో నాకు చూపించండి.