
అంధులైన మార్గదర్శకులారా, దోమలేకుండు నట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే. ! —మత్తయి 23:24
ఈరోజు ఎన్ని డినామినేషన్ లు మరియు వ్యక్తిగత సంఘములు ఉన్నాయనే విషయాన్ని నమ్ముట చాల కష్టము అయిననూ ఒకే బైబిల్ మరియు ఒకే సందేశమును కలిగి యున్నాము.
కానీ సంవత్సరములు జరుగుతుండగా, గర్వము మరియు ఇరుకు మనస్సుతో ప్రజలు అనేక సంఘములు మరియు సంఘ బృందములను అభివృద్ధి చేయాలని – అంతే కాక విభిన్న బైబిల్ వర్షన్లు – బైబిల్ చెప్పే దానిని వారు నమ్మే విభిన్న అనువాదములకు సహాయపడుట అనే అవసరతలను ప్రజలు కలిగి యున్నారు.
మనలో ఏ ఒక్కరూ 100 శాతం సరియైన వారు కారని నేను గుర్తించి యున్నాను. మనము పోరాడే అనేక విషయాలు చాలా చిన్నవి. మత్తయి 23:24లో దోమలేకుండునట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే అని యేసు పరిసయ్యులతో చెప్పి యున్నాడు. వారు చిన్న విషయాలను గురించి ఆలోచిస్తూ నిజమైన ప్రాముఖ్యమైన సంగతులను గురించి మరచి పోతారు.
మనం గర్వమును అనుమతిస్తే మన జీవితములలో ద్వేషము మరియు విభిన్నతలు చోటు చేసుకుంటాయి. వాటిని ఆపుటకు మనము శక్తిహీనులమవుతాము. క్రీస్తు ప్రేమలోని అంగీకారము మరియు గర్వమును ఓడించుటకు శక్తిని అనుగ్రహించుము. దేవుని ప్రేమ ఎల్లప్పుడూ ఇతరుల యెడల కష్టమైన విభజన వైఖరుల కంటే గొప్పది.
ప్రారంభ ప్రార్థన
పరిశుద్ధత్మా, నా జీవితాన్ని ప్రభావితం చేసే భిన్నత్వము, దురాభిప్రాయము లేకా ద్వేషమును కలిగించే ఏ పాపమైనా నా హృదయములో ఉన్నయెడల దానిని బహిర్గతం చేయండి. నేను క్రీస్తు నందు నా ప్రియ సహోదరీ సహోదరులతో నీ ప్రేమలో నడవాలని మరియు ఐక్యతను కలిగి యుండాలని ఆశించుచున్నాను.