
మీరైతే ఎట్టి వారిని గూర్చియైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలుచేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన, కృతజ్ఞతలేనివారి యెడలను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు. —లూకా 6:35
కొన్ని సంవత్సరముల క్రితము ఒకరు మా పరిచర్యను వ్యాపారముగా ఉపయోగించుచున్న వ్యక్తిని గురించి నాతో చెప్పారు. నా స్నేహితుడు అదే రెస్టారెంట్ లో ఉండుట తటస్థించింది మరియు మేమిద్దరమ ప్రక్క ప్రక్కన కూర్చున్నాము మరియు అతడు నా గురించి మాట్లాడుతున్న ఈ సంభాషణను అతడు విన్నాడు – మరియు ఎవరిని గురించి కూడా మంచి మాటలు పలుకుట లేదు.
మొదటగా నేను కోపముతో అతని మరెన్నడూ మాతో కలిసి ఎటువంటి పని చేయుటకు అనుమతించను అని చెప్పాలను కున్నాను. కానీ ఆ రాత్రి, పరిశుద్ధత్ముడు నాతో, “నీవు ఆ విషయాలలో ఏదియు చేయబోవడం లేదు” అని చెప్పాడు. ఆయన నాతో “లేదు, నీవేమి బోధిస్తున్నవో దానినే చేయబోతున్నావు. నీవు వెళ్లి అతని కొరకు ఒక బహుమానమును కొంటావు మరియు నీవు అతని వద్దకు వెళ్లి మీరు మా కొరకు చేస్తున్న సేవలను నేను అభినందిస్తున్నాను అని చెప్పబోతున్నావు?” అని నాతో చెప్పాడు.
అది సులభం కాదు, కానీ దేవుడు తన దిశలో విధేయత చూపుటకు మరియు ఈ వ్యక్తికి నేను ఆశీర్వదకరముగా ఉండుటకు తన కృపను నా యెడల చూపి యున్నాడు.
నేను ఈ పరిస్థితిని గురించి ఎక్కువగా నాకు గుర్తు పెట్టుకొనునది ఎదనగా నేను అతనికి మంచి చేయుటకు ప్రారంభించగా దానిని చేయుటలో నేనెంతగానో ఆనందించి యున్నాను.
మనలను గాయపరచిన వారి యెడల మనము కనికరముతో చూసినపుడు దేవుడు మన హృదయాల్లో ఎలా ఆనందాన్ని నింపుతాడో అది మన అంతరంగములో ఆనందమును నింపుతుంది.
కాబట్టి ఈరోజు మీరు ఎవరిని క్షమించి వారి కొరకు ఒక మంచి పనిని చేయాలని ఆశిస్తున్నారు? క్షమించుటను అభ్యాసం చేయండి మరియు మిమ్మలి నిజమైన సమాధానము మరియు ఆనందములోనికి నడిపించే మార్గమును అనుసరించండి!
ప్రారంభ ప్రార్థన
దేవా, మీ వాక్యమునకు విదేయులగుటకు మరియు నన్ను గాయపరచిన వారికి మేలు చేయుటకు నీ కృప నాకు అవసరమై యున్నది. నేను వారిని క్షమించి ఆశీర్వదించుచుండగా, మీరు నన్ను శాంతి మరియు నా ప్రాణమునకు ఆనందమును దయ చేస్తారని నేను ఎరిగి యున్నాను.