మీరు దేనిగూర్చియైనను ఎవని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను. నేనేమైనను క్షమించియుంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు, మీ నిమిత్తము, క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను; సాతాను తంత్రములను మనము ఎరుగనివారము కాము. —2 కొరింథీ 2:10-11
క్షమాపణ మనకు సహాయం చేస్తుంది ఎందుకనగా మనలో పని చేయునట్లు దేవుని వాక్యమును విడుదల చేస్తుంది. నేను క్షమించలేనితనము అనే విషముతో నేను నింపబడకుండా ఉన్నట్లయితే నేను సంతోషిస్తాను మరియు మంచి భావన కలిగి యుంటాను. చాలా భయంకరమైన వ్యాధులు ఒక వ్యక్తి మీద కలిగే ఒత్తిడి మరియు చేదు అనుభవాల ఫలితమే.
మనము ఇతరులను క్షమించని యెడల మన తండ్రి మన పాపములను క్షమించడు మరియు మనము దేనిని విత్తుతామో దానినే కోస్తాము (మత్తయి 6:14-15; గలతీ 6:7-8 చూడండి). కనికరమును విత్తుడి మరియు మీరు కనికరమును కోస్తారు; తీర్పును విత్తండి అప్పుడు మీరు తీర్పు అనే పంటనే కోస్తారు. ప్రభువుకు మీ హృదయమనే తలుపు తెరవబడునట్లు మీ జీవితములోని దేవుని కృప ద్వారా మీరు క్షమించవలసి యున్నది.
క్షమించలేనితనము సాతానుడు మిమ్మల్ని పట్టి ఉంచుటకు అవకాశమును కలుగజేస్తుంది మరియు దాని కొరకు మీరు బలమైన దుర్గమును సృష్టించవలసి యుంటుంది. అతనికి బలమైన దుర్గము ఉన్నప్పుడు అతడు పరిశుద్ధాత్మ దేవుని ప్రభావమును అడ్డుకొనగలడు. మీరు క్షమించినప్పుడు, సాతానుడు మీ మీద అవకాశమును తీసుకొనడు మరియు దేవునితో మీ సహవాసము ఉచితముగా పొర్లి పారుతుంది.
మీరు దేవుని వాక్యమునకు విధేయత చూపవలేనని ఎంపిక చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు విజయమును సాధించగలరు. కాబట్టి మీకు మీరు ఒక మేలు చేయండి మరియు క్షమించుటకు త్వరపడండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను నా జీవితములో సాతానుకు ఒక పట్టు లేక బలమైన దుర్గమును ఇవ్వాలని నేను ఆశించుట లేదు. నేను నీతో కలిగియున్న సహవాసములో దేనికి అడ్డుకాకుండా చూసుకుంటాను. నేను నీతో స్వేచ్చగా సహవాసమును కలిగి యుండునట్లు నేను క్షమించుటకు ఎన్నుకొని యున్నాను.