ఆయన ఈ మాట చెప్పి వారిమీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి! —యోహాను 20:22
మనము క్షమించే హృదయమును కలిగి యుండవలెనని దేవుడు కోరుతున్నాడు. మనమందరమూ దేవునికి విదేయత చూపుటకు మరియు ఏ దోషమునైనా అనగా చిన్న దాని నుండి పెద్ద దాని వరకు సాతానుడు మన ఆలోచనలను ఎంత చేదుగా చేయాలని ప్రయత్నించినా మనము క్షమించుటకు సిద్ధంగా ఉండాలి. ఇది తరచుగా సులభమే కానీ మీరు మీ స్వంతగా చేయవలెనని దేవుడు ఆశించుట లేదు.
పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మీరు క్షమించలేరు. దీనిని మీ స్వంతగా చేయుట చాల కష్టము కానీ మీకు ఇష్టమైతే మీకు సహాయం చేయుటకు ఆయన పరిశుద్ధాత్మను పంపును. మీరు కేవలం విధేయత చూపవలసియున్నది మరియు ఆయన సహాయం కొరకు వేడుకొనవలసి యున్నది.
యోహాను 20:22లో యేసు శిష్యుల మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకొనుమని చెప్పి యున్నాడు. ఆయన ఇచ్చే తరువాత హెచ్చరిక ఏదనగా ప్రజలను క్షమించుట. ఆయన మీతో కూడా అదే చెప్తున్నాడు. ఆయన మిమ్మును పరిశుద్ధత్మతో నింపవలెనని ఆశిస్తున్నాడు మరియు మీరు క్షమించుటకు సహాయం చేయును కానీ మీరు అడిగి పొందు కొనవలెను. మీకు ఇష్టమైతే, మీ హృదయములోని చేదు లేక క్షమించలేని తనము నుండి బయటపడుటకు దేవుడు మీకు శక్తిని అనుగ్రహించును.
మిమ్మును గాయపరచిన వారిని క్షమించుటకు మీ మీద పరిశుద్ధాత్మను ఊదమని దేవునిని అడగండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను సిద్ధముగా ఉన్నాను. నాపై ఊదండి మరియు మీ ఆత్మతో నన్ను నింపండి. నేను పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందటానికి మరియు క్షమించటానికి ఎంచుకుంటాను.