గత విచారణను తరలించి కొత్త ఎంపికలను చేయండి

గత విచారణను తరలించి కొత్త ఎంపికలను చేయండి

కాగా ఎవడైనను క్రీస్తు (మెస్సీయా) నందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి (గత నీతి మరియు ఆత్మీయ స్థితి) గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;  – 2 కొరింథీ 5:17

తప్పుడు నిర్ణయాలు అపరాధ భావనను కలిగిస్తాయి, మరియు మనకు అపరాధ భావనను కలిగి యున్నప్పుడు, మనము దానితో వ్యవహరించవలెను మరియు అది మన భవిష్యత్తులో ఉత్తమ నిర్ణయాలు చేయుట మనకు బోధించునట్లు అనుమతించుము.

తప్పుడు నిర్ణయాలు తీసుకొనుట అపరాధ భావనను కలిగించునని నేను మొదటిగా అర్ధం చేసుకొనవలెను. అనేక సంవత్సరాల క్రితము నన్ను నేను చుసుకోనినప్పుడు నా భర్త డేవ్ మరియు నాకు మధ్య గొప్ప తేడాను నేను గమనించుట నేను జ్ఞాపకం చేసుకొని యున్నాను ఎందుకనగా అయన తన జీవితమంతయు అభ్యాసం చేసే వాడు కాబట్టి చాలా ఆరోగ్యముగా, బలముగా మరియు శరీరకముగా మంచి ఆకారములో ఉన్నాడు.

ప్రారంభంలో, నేను డేవ్ వలె బలముగా లేనని చాల బాధ పడేదానిని, కానీ తరువాత దానిని గురించి నేను ఏదో ఒకటి చేయాలని గుర్తించాను. ఇప్పుడు నేను క్రమముగా అభ్యాసం చేస్తున్నాను మరియు నాలో కలిగిన అనుకూల మార్పును బట్టి నేను చాల ఆశ్చర్య పడ్డాను.

దేవునిలో మీరు ఒక నూతన సృష్టియని బైబిల్ చెప్తుంది. మీరు మీ పాత మార్గములలో నివసించవలసిన అవసరం లేదు కానీ ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడి నూతన వ్యక్తులుగా మార్చబడవచ్చును. మీరు గతములో తీసు కొనిన కొన్ని అజ్ఞాన నిర్ణయాల వలన మీరు అపరాధభావన కలిగి యుండవలసిన అవసరం లేదు, దానిని గురించి ఆలోచిస్తూ మోసపోవద్దు దానిని గురించి మీరిప్పుడు ఏమీ చేయలేరు. ఏది సరియైనదో దానిని చేయుట ప్రారంభించండి మరియు దానిలో మీరు స్థిరముగా ఉండండి.

మీరు ఉత్తమ నిర్ణయములు తీసుకొనుట ప్రారంభించుట ద్వారా, అనుదినము దేవుని ఆశీర్వాదములను ఆనందించుటయనే అనుభవములోనికి మీరు వస్తారు.

ప్రారంభ ప్రార్థన

పరిశుద్ధత్మా, నేను నూతన సృష్టిగా మార్చబడ్డానని నేను ఎరిగి యున్నాను. నా గతమును బట్టి నేను అపరాధ భావనలో ఉండాలని ఆశించుట లేదు. నేను నా భవిష్యత్తులో ఆనందించునట్లు మంచి నిర్ణయములు తీసుకోనునట్లు నాకు సహాయం చేయుము.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon