
యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. (యోహాను 19:30)
యేసు సిలువపై నుండి, “సమాప్తమైనదని!” మాట్లాడినప్పుడు చట్టబద్ధత వ్యవస్థ ముగిసిందని, ఇప్పుడు మతపరమైన ప్రధాన యాజకులు మాత్రమే దేవుని సన్నిధిలోకి ప్రవేశించుట మాత్రమే కాదు, కానీ ప్రజలందరూ ఆయన సన్నిధిని ఆస్వాదించవచ్చని, ఆయనతో మాట్లాడవచ్చని మరియు ఆయన స్వరాన్ని వినవచ్చని ఆయన ఉద్దేశించారు.
యేసు మన పక్షమున మరణించే ముందు, దేవుని వాగ్దానాలను స్వీకరించడానికి ఏకైక మార్గం పరిపూర్ణమైన, పాపరహితమైన జీవితాన్ని గడపడం (చాలా చట్టబద్ధంగా ఉండటం ద్వారా), లేదా పాపం కోసం రక్త త్యాగం, చంపబడిన జంతువుల బలి. యేసు మరణించి, మానవజాతి పాపములను తన రక్తంతో శుద్ధి చేసినప్పుడు, ప్రతి వ్యక్తి దేవుని సన్నిధిని ఆనందించడానికి ఒక మార్గాన్ని తెరిచాడు. “సమాప్తమైనది” అని యేసు చెప్పినప్పుడు ఆయన మనల్ని భయం కంటే స్వేచ్ఛా జీవితానికి ఆహ్వానించాడు. నియమాలు మరియు నిబంధనలకు బదులుగా మనం పరిశుద్ధాత్మచే నడిపించబడునట్లు చేశాడు. అన్ని సమయాలలో ప్రతిదీ సరిగ్గా చేయని సాధారణ ప్రజలు ఇప్పుడు దేవుని సన్నిధిలోకి స్వేచ్ఛగా ప్రవేశించవచ్చు.
చట్టబద్ధత నుండి విముక్తి అనేది అన్యాయానికి లేదా సోమరితనానికి పిలుపు కాదు. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం మరియు మన కోసం దేవుని నుండి వినడం మనలో ప్రతి ఒక్కరి బాధ్యత, ఇది దేవుడు ఆది నుండి ఎల్లప్పుడూ కోరుకునేది.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు మరియు ఆయన మీ జీవితములో మీరు ఆనందించాలని ఆశిస్తున్నాడు.