చింతల మధ్యలో ప్రార్ధన యనే వైఖరిని అభివృద్ధి చేయుట

చింతల మధ్యలో ప్రార్ధన యనే వైఖరిని అభివృద్ధి చేయుట

దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను (ప్రతి విన్నపములో) ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. —ఫిలిప్పి 4:6

మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు దానిని గురించి మాట్లాడుట కంటే దాని కొరకు ప్రార్ధించుట ఉత్తమము. ప్రార్ధన యనునది విజయవంతమైన జీవితమునకు బ్లుప్రింట్ వంటిది. ఆయన ఈలోకములో ఉన్నప్పుడు, యేసు ప్రార్ధించాడు. ఆయన ప్రార్ధన ద్వారా సమస్తమును – ఆయన ప్రతిష్ట మరియు జీవితాన్ని కూడా దేవునికి అప్పగించాడు. దీనిని మనము కూడా చేయగలము. మనము మన సమస్యలన్నిటినీ ఆయనకు వివరించవలసిన పని లేదు; మనము కేవలం ఆయనకు అప్పగించాలి మరియు సమస్తమును ఆయనను చూసుకొనుమని అడగాలి.

ప్రార్థనను క్లిష్టతరం చేయకుండా జాగ్రత్త వహించండి. ప్రజలు ఎప్పుడైనా ప్రార్థన చేయగలరని గ్రహించకుండా, వారు నిజంగా ప్రార్థన చేసే ముందు దేవునితో ఒంటరిగా సమయం గడపడానికి లేదా చర్చికి వెళ్ళే వరకు ప్రజలు చాలాసార్లు వేచి యుంటారని నేను అనుకుంటున్నాను. సరళమైన, నమ్మకమైన ప్రార్థనపై విశ్వాసం కలిగి ఉండండి మరియు ఫిలిప్పీ 4:6 లోని పౌలు సూచనలను జ్ఞాపకం చేసుకోండి. చింతించటానికి బదులుగా, మీరు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారని కనుగొన్నప్పుడు ప్రార్థన చేయండి మరియు సహాయం కొరకు దేవునిని అడగండి.

దేవుడు నమ్మకమైనవాడు అని బైబిల్ చెప్తుంది – అది ఆయన గుణలక్షణాలలో ఒకటి. సహాయం కోసం ఆయనకు ప్రార్థించేటప్పుడు ఆయన మనకు సహాయం చేయుటకు సిద్ధంగా ఉంటాడు కాబట్టి మనం ఆయనను పూర్తిగా నమ్మాలి మరియు పూర్తిగా విశ్వసించాలి. మనము దీనిని చేసినప్పుడు, మన దారిలో ఎదురయ్యే ఏ పరిస్థితికైనా మనము సిద్ధంగా ఉంటాము.


ప్రారంభ ప్రార్థన

దేవా, నేను చింత పడుతూ నా జీవితాన్ని జీవించలేను. బదులుగా, నేను అన్నివేళలా ప్రార్ధించే అలవాటు కలిగి యుండుటకు ఈరోజే నిర్ణయించుకున్నాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon