యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి (ఆయనను గౌరవించి ఆరాధించేవారికి) ఏమియు కొదువలేదు. —కీర్తనలు 34:9
నేను ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు నేను ఉదయాన్నేనా ప్రస్తుత పరిస్థితిని గురించి ఆందోళన చెందుటకు బదులు దాని గురించి నేను ఏమి చేయబోతున్నానో పరిశీలిస్తాను.
అకస్మాత్తుగా నేను నా ఆత్మలోపల మెల్లని స్వరము చెప్పుట విన్నాను, జాయిస్, మీరు మీ సమస్యను ఆరాధించబోతున్నారా లేక నన్ను ఆరాధించబోతున్నారా? చూడండి, దేవుడు నా సమస్యను మర్చిపోయి ఆయనను ఆరాధించుటకు నేను సమయం గడిపినట్లైతే నా సమస్యను పరిష్కరించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు.
మేము ప్రభువును ఆరాధించేటప్పుడు, మనలను కుదించి వేసే భావోద్వేగ లేదా మానసిక భారం విడుదల చేస్తాము. ఇది దేవుని గంభీర్యాన్ని మింగివేస్తుంది. మనము దేవునిపై దృష్టి నుంచి ఆయనను ఆరాధించినట్లైతే మన జీవితము కొరకు మన మేలు కొరకే సమస్తము సమకూడి జరుగుట చూడగలము.
నిజంగా దైవభయముతో ప్రభువును పూజించే వారికి ఏమేలు కొదువగా ఉండదని బైబిల్ చెప్తుంది. మీ అన్ని అవసరాలు నెరవేరాలని మీరు ఆశిస్తున్నారా?అప్పుడు ఆరాధించడానికి గుర్తుంచుకోండి, చింతించకండి.
మీరు ఎదుర్కొన్న కష్టాల విషయమైతే, దేవుణ్ణి కీర్తిస్తూ స్తుతించండి. మీ హృదయంలో విశ్వాసం పెరుగుతుంది, మరియు మీరు వాటిని జయిస్తారు.
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను చింతించను. బదులుగా, నేను నిన్ను ఆరాధించటానికి ఎంపిక చేస్తున్నాను. నీవు గొప్పవాడవు మరియు నీవు నా యెడల కలిగియున్న ప్రేమ వలన నా అవసరాలు తీర్చబడతాయని నాకు తెలుసు.