చింత అనగా మారు వేషంలో ఉన్న స్వార్ధం

చింత అనగా మారు వేషంలో ఉన్న స్వార్ధం

… విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము. (ఏదైతే దేవుని అంగీకారము లేకుండా ఉద్భవించునో అది పాపము) —రోమా 14:23

చాలా తరచుగా ప్రజలు ఏదైనా విధ్వంసకమును గుర్తించకుండా చాలా చింతిస్తారు. మీరు దాని వేరును చూసినట్లైతే చింతించుట యనునది పాపము. చింత ఖచ్చితముగా విశ్వాసమునుండి రాదు. రోమా 14:23 మనకు తెలియజేయున దేమనగా విశ్వాస మూలము కానిదేదో అది పాపము.

చాలాసార్లు చింత అనునది ప్రత్యేకముగా ఒక పాపము నుండి వస్తుంది: స్వార్ధము. సాధారణంగా మనము చింతించినప్పుడు, మన స్వార్ధపూరిత కోరికలు నెరవేరలేదు కాబట్టి మనము చింతిస్తాము.

మనము ఎంతగా స్వార్ధపూరిత కోరికలను కలిగి యుంటామో అంతగా మీరు దానిని గురించి చింతిస్తారు మరియు మీ జీవితము మరింతగా కష్టతరమవుతుంది.

దేవుడు మనలను కేవలము ఆయన మీద మనస్సు నుంచమని కోరుతున్నాడు.

మనము మన జీవితాన్ని చింత మరియు ఆతృత నుండి విడిపించబడవలెనని కోరుతున్నాడు. మనము స్వేచ్ఛగా దేవునిని సేవించవలెనని కోరుతున్నాడు (1 కొరింథీ 7:34 చూడండి). మన జీవితములోని దేవుని చిత్తమునుండి మనలను దూరపరచే ఇహలోక చింతలను మనము అనుమతించ కూడదు. స్వార్ధ పూరిత కోరికల నుండి విడిపించబడుటకు సహాయం చేయుమని దేవునికి ప్రార్ధించండి. ఇది మీ జీవితమును సులభతరం చేస్తుంది మరియు చింతను జయించుటకు సహాయపడుతుంది. అప్పుడు మీరు మీ జీవితంలోని దేవుని ప్రణాళికను మీరు హృదయ పూర్తిగా పొందుకొనగలరు.


ప్రారంభ ప్రార్థన

తండ్రియైన దేవా, చింతించుట కూడా పాపమే అని నాకు చూపించినందుకు వందనములు. నా స్వార్ధము, దైవికము కానీ కోరికల నుండి నన్ను దూరపరచుము తద్వారా నీవు నా యెడల కలిగియున్న గమ్యమును నేను చేరగలను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon