
నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను (మీ ధర్మశాస్త్రము ద్వారా మీ జీవితమునకు వేయబడిన మార్గములు) మన్నించెదను. —కీర్తనలు 119:15
లోతైన గాయము అతి పెద్ద నిరుత్సాహముల ద్వారా అనగా మనము కోరుకొనిన ఉద్యోగమము లేక ప్రమోషన్ రాలేదు కాబట్టి రాదు. లోతైనా ఉద్రేక పరమైన గాయముము అతి స్వల్పమైన కోపములు లేక నిరాశల శ్రేణి నుండి ఉద్భవిస్తుంది. అందుకే మనము అతి స్వల్పమైన అనుదిన నిరుత్సాహములను ఎలా వ్యవహరించాలో మరియు వాటిని ఎలా క్రమపరచాలో నేర్చుకుందాము.
మనము దేని మీదైనా దృష్టి నుంచుటలో కొనసాగుతున్నట్లైతే దానిని ధ్యానించుట అంటాము. మన అనుదిన జీవితాలలో వచ్చే స్వల్ప చికాకులు దిన దినము పెరుగుతూ ఉంటే దేని మీదైనా మనస్సుంచుట అసాధ్యము.
కానీ మీరు మీ సమస్యల మీద దృష్టిని నిలిపి నిరుత్సాహపడుతూ ఉన్నట్లైతే దేవుని మీద దృష్టిని నిలిపి ఆయన మీ కొరకు కలిగియున్న వాగ్దానములను ధ్యానించుడి. జీవితము మిమ్మల్ని నిరాశ పరుస్తుంది, కానీ మీరు క్రుంగి పోనవసరం లేదు. దేవుడు మిమ్మల్ని లేపుటకు నిలబెట్టుటకు సిద్ధంగా ఉన్నాడు.
నిరుత్సాహములు మిమ్మల్ని క్రుంగిపోవునట్లు చేసినప్పుడు, అవి మిమ్మల్ని నిరాశకు గురి చేయుటకు అనుమతించ వచ్చును లేక ఉత్తమ విషయాలను చేరుకొనుటకు వాటిని పునాది రాళ్ళుగా వాడుకొనవచ్చును. దేవుని మార్గములను ధ్యానించుచుండగా నిరుత్సాహములను ఎదుర్కొనుటకు ఎన్నుకోండి. ఆయన మీ కొరకు ఉత్తమ విషయాలను కలిగి యుండాలని ఆశించుచున్నాడు మరియు నిరుత్సాహమును ఓడించుటకు ఆయన మీ కొరకు సహాయం చేయును.
ప్రారంభ ప్రార్థన
దేవా, కీర్తనలు 119:15 చెప్పినట్లుగా, నన్ను బాధపరచే స్వల్పమైన నిరుత్సాహములను నేను ధ్యానించక నీ వాక్యమునే ధ్యానించుదును. మీ వాక్యము శక్తివంతమైనది మరియు జీవమునిచ్చును కాబట్టి, నీవైపు చూచుచు నేను నిరుత్సాహములను జయించగలను!