సంతోషహృదయము ముఖమునకు తేటనిచ్చును. మనోదుఃఖమువలన ఆత్మ నలిగిపోవును. —సామెతలు 15:13
ఎలా నవ్వాలో ప్రతి ఒక్కరికీ తెలుసు. అది దేవుడు మనకిచ్చిన గొప్ప వరములలో ఒకటి. ఒక చిరునవ్వు ప్రజలను మంచిగా భావించునట్లు చేయును మరియు ప్రజలు నవ్వుతుండగా వారు చాల అందముగా కనపడతారు. మీ జీవితములో ఆనందము ఉన్నప్పుడు అది ఇతరుల మీద ప్రభావాన్ని చూపుతుంది. కానీ మీలోని ఆనందమును లోపలే ఉంచి తాళము వేసినట్లయితే మీ చుట్టూ ఉన్నవారిని ఆనందము మరియు తాజా అనుభవము నుండి త్రోసివేస్తున్నారు.
చాలా మంది ప్రజలు ఆనందమును వ్యక్తపరచుట ద్వారా వారి పరిస్థితులను మరియు బహుశా ఇతరుల పరిస్థితులను కుడా మార్చుతున్నారని అర్ధం చేసుకొనుటలేదు. మీ జీవితాన్ని ప్రభువు యొక్క ఆనందముతో జీవిస్తున్నట్లైతే అది ప్రతికూల, నిరాశతో కూడిన పరిస్థితులను పారద్రోలుతుంది. మన అంతరంగములో ఆయన ఆనందమును కలిగి యున్నట్లయితే, మనము చిరునవ్వుతో దానిని ఇతరులకు చూపగలము!
నవ్వుట అనునది అంత గంభీరమైన విషయమని నేను ఎప్పుడూ ఆలోచించలేదు కానీ ఒక చిన్న చిరునవ్వు ఎంత విప్లవాత్మకముగా ఉంటుందో దేవుడు నాకు చూపించి యున్నాడు. నిశ్శబ్దపు వెలుగుతో కూడిన చిరునవ్వు మీ జీవితములో మంచి విషయాలను తీసుకొని వస్తుంది మరియు ఇతరులతో ఆనందము మరియు వెలుగును పంచు కుంటుంది… కాబట్టి నవ్వండి!
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, ప్రతి దినము చిరునవ్వు కలిగి యుండుటకు నాకు జ్ఞాపకము చేయుము! మీరు నాకు గొప్ప ఆనందమును ఇచ్చి యున్నారు మరియు నేను దానిని ఇతరులకు చూపాలని మరియు ఇతరుల జీవితాలను వెలిగించాలని ఆశిస్తున్నాను!